శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 మార్చి 2020 (19:00 IST)

డేటా ప్లస్ టాక్‌టైమ్ అందించే రిలయన్స్ జియో

ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో తన యాడ్ ఆన్‌పై కొన్ని అదిరే ప్లాన్స్ మార్పులు చేసింది. గత 2018వ సంవత్సరం ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో సంస్థ తన కస్టమర్లకు యాడ్-ఆన్ రిఛార్జ్ సేవలను అందించింది. 
 
ప్రస్తుతం ఈ రీఛార్జ్ సేవలో మార్పులు చేసింది. యాడ్-ఆన్ రీఛార్జ్ చేసేటప్పుడు ఇకపై మునుపుకంటే రెండింతలు డేటా మరియు వాయిస్ కాల్స్‌కు సంబంధించిన నిమిషాలను అదనంగా ఇవ్వడం జరుగుతుంది. ఎలాగంటే.. రూ.11, రూ.21, రూ.51, రూ.101లకు యాడ్-ఆన్ రీఛార్జ్ 400 ఎంబీ, 1జీబీ, 3జీబీ, 6జీబీ డేటాను అందించింది. 
 
ప్రస్తుతం ఈ ప్లాన్ మార్పుల్లో భాగంగా 800 ఎంబీ, 2జీబీ, 6జీబీ, మరియు 12 జీబీ డేటా అందించనుంది. అలాగే వాయిస్ కాల్స్ కోసం అందించే నిమిషాల సంఖ్య రెండింతలు అధికంగా ఇవ్వనున్నట్లు జియో ప్రకటించింది.