శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 మే 2020 (13:34 IST)

బీఎస్ఎన్ఎల్ రూటు మార్చింది.. క్యాష్ బ్యాక్ కూడా..?

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ రూటు మార్చింది. రీఛార్జ్ చేసే బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు నాలుగు శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే వొడాఫోన్, ఐడియా, ఎయిర్ టెల్, రిలయన్స్ జియో వంటి సంస్థలు తమ వినియోగదారులకు రిఛార్జ్ చేసే ఆఫర్లపై క్యాష్ బ్యాక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
ఇదేవిధంగా బీఎస్ఎన్ఎల్ కూడా తన కస్టమర్లకు రీఛార్జ్‌లపై నాలుగు శాతం క్యాష్ బ్యాక్ ప్రకటించింది. ఫలితంగా కస్టమర్లు ఇతర బీఎస్ఎన్ఎల్ నెంబర్లకు రీఛార్జ్ చేసుకుంటే.. నాలుగు శాతం ఆఫర్ ప్రకటించింది. ఇంకా బీఎస్ఎన్ఎల్ 2.0.46 అప్‌డేట్ కోసం ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ఇంకా ఈ ఆఫర్ మే 31వ తేదీ వరకు మాత్రమే వర్తిస్తుందని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది.