శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. అవకాశాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 మార్చి 2020 (10:35 IST)

తెలంగాణ సర్కిల్‌లో ఉద్యోగాల భర్తీ.. బీఎస్ఎన్ఎల్ నోటిఫికేషన్ విడుదల

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్.. తెలంగాణ సర్కిల్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం వంద ఖాళీలకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. కానీ ఇవి ఏడాది కాలం పోస్టులు మాత్రమే. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల్ని బీఎస్ఎన్ఎల్ భర్తీ చేస్తోంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు.
 
ఆసక్తి గల అభ్యర్థులు నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్-NATS వెబ్‌సైట్‌ http://www.mhrdnats.gov.in/లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 మార్చి 16 చివరి తేదీ అని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. 
 
వివరాలు.. 
బీఎస్ఎన్ఎల్ అప్రెంటీస్‌కు అప్లై చేయడానికి చివరి తేదీ- 2020 మార్చి 16
సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం డేటాబేస్ అందించడానికి చివరి తేదీ - 2020 మార్చి 18
ఇంటర్వ్యూ- 2020 మార్చి 19