సంబంధిత వార్తలు
- తెలంగాణ ఆర్టీసీ సమ్మె: కేసీఆర్ చెప్పిన మాటల్లో నిజమెంత? నష్టాలు, జీతాలపై సీఎం లెక్కల్లో వాస్తవాలేమిటి?
- నాన్న బయోపిక్‌లో నేనా? అదో కన్ఫ్యూజన్: బాలయ్యకు దెబ్బేసిన చెర్రీ
- చిల్లరపోసి హోండా మోటార్ బైక్ కొన్నాడు.. బస్తాల్లో డబ్బు తెచ్చాడు...
- శ్రీముఖి బర్త్ డే రోజునే అది జరిగిపోయింది: బిగ్ బాస్ 3పై హేమ బిగ్ బాంబ్
- పునర్నవి హైపర్ పిల్ల... ఇంటికి రా.. అమ్మ రొయ్యల కూర చేసింది..(video)
రామ్ చరణ్ ఫ్లాప్ డైరెక్టర్‌తో సినిమా చేస్తున్నాడా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటివరకు సైరా సినిమా బిజీలో ఉన్నాడు. ఇక ఇప్పటి నుంచి తను నటించే తదుపరి చిత్రాలపై దృష్టి పెడుతున్నాడట. చరణ్‌తో సినిమా చేసేందుకు చాలామంది దర్శకులు ప్రయత్నిస్తున్నారు. అలాగే చరణ్ కూడా కొంతమంది దర్శకులకు మాట ఇచ్చాడు. అలా.. చరణ్ మాట ఇచ్చిన వారిలో విక్రమ్ కుమార్ ఒకరు.
అవును.. విక్రమ్ కుమార్‌తో సినిమా చేస్తానని మాట ఇచ్చాడట చరణ్. విక్రమ్ కుమార్ కూడా ఓ ఇంటర్వ్యూలో చరణ్‌తో సినిమా చేసేందుకు కథ రెడీ చేస్తున్నట్టు చెప్పారు. ఇష్క్, మనం, 24 చిత్రాలతో విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా విక్రమ్ కుమార్ మంచి పేరు సంపాదించారు. అయితే... ఇటీవల తెరకెక్కించిన హలో, గ్యాంగ్ లీడర్ చిత్రాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి.
అయినప్పటికీ చరణ్ విక్రమ్ కుమార్‌తో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. ప్రస్తుతం విక్రమ్ కుమార్ కథపై కసరత్తు చేస్తున్నారట. త్వరలో చరణ్‌కి స్టోరీ చెప్పనున్నారని సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. రామ్ చరణ్ - విక్రమ్ కుమార్ కాంబినేషన్లో సినిమా రావచ్చు అని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి... చరణ్ ఇచ్చినమాట ప్రకారం విక్రమ్‌తో సినిమాకి సై అంటాడో లేదో చూడాలి.
తర్వాతి కథనం
