శోభనానికి సిద్ధమవుతున్న ఆ హీరోయిన్ ఎవరు?
తెలుగులో ఎంతో సంప్రదాయబద్దంగా నటిస్తూ పక్కింటి అమ్మాయిలా అనిపించే నటి కాజల్ అగర్వాల్ బాలీవుడ్‌లో మాత్రం రెచ్చిపోతోంది. లిప్ లాక్, బెడ్ రూమ్ సీన్స్‌లలో రెచ్చిపోయి నటిస్తోంది. తాజాగా ఈ భామ శోభనానికి కూడ
తెలుగులో ఎంతో సంప్రదాయబద్దంగా నటిస్తూ పక్కింటి అమ్మాయిలా అనిపించే నటి కాజల్ అగర్వాల్ బాలీవుడ్‌లో మాత్రం రెచ్చిపోతోంది. లిప్ లాక్, బెడ్ రూమ్ సీన్స్‌లలో రెచ్చిపోయి నటిస్తోంది. తాజాగా ఈ భామ శోభనానికి కూడా రెడీ అవుతోంది. యాంటిక్ జ్యువెల్లరీ, కొప్పులో మల్లెపువ్వులు పెట్టుకుని అందాల బొమ్మలా తయారైంది. అయితే ఇదంతా రియల్ కాదండోయ్.. రీల్.
సుదీప్ సరసన నటిస్తున్న ఓ చిత్రంలోని సీన్ కోసం ఈ ముద్దుగుమ్మ శోభనం కోసం రెడీ అవుతోంది. ఈ సినిమాలో శోభనం సీన్ తర్వాత వెంటనే పాట కూడా వస్తుందట. అందుకే, కాజల్‌ని స్పెషల్‌గా ముస్తాబు చేస్తున్నారట మేకప్ సిబ్బంది. అసలే అందగత్తె అయిన కాజల్ మరింత అందంగా ముస్తాబవుతోంది.
శోభనపు పెళ్లికూతురు కళ వచ్చేసింది కదూ అనిపిస్తుంది ఆమెను చూస్తుంటే? మరో పక్క ఈ భామ వరుస సినిమాలతో ఫుల్‌బిజీగా ఉంది. తమిళంలో కూడా ఆమెకు చాన్స్‌లు క్యూ కడుతున్నాయి. తెలుగులోనూ మరిన్ని బడా సినిమాలకు కమిట్ అయ్యే ఆలోచనలో ఉంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో జోడీగా ఖైదీ నెంబర్ 150 చిత్రంతో బిజీగా ఉంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.