1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Manjima Mohan on Hot and Kissing Scenes

గ్లామర్‌కు అశ్లీలానికి మధ్య సన్నని తెర ఉంది : మంజిమా మోహన్

వర్ధమాన నటీమణుల్లో మంజిమా మోహన్ ఒకరు. 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలో నాగచైతన్యతో జతకట్టిన మంజిమ త్వరలోనే మరో తెలుగు సినిమాలో కనిపిస్తానని చెప్పింది. ఈ మధ్యనే లిప్ లాక్‌కి కూడా సిద్ధమని ప్రకటన ఇచ్చింద

Manjima Mohan
వర్ధమాన నటీమణుల్లో మంజిమా మోహన్ ఒకరు. 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలో నాగచైతన్యతో జతకట్టిన మంజిమ త్వరలోనే మరో తెలుగు సినిమాలో కనిపిస్తానని చెప్పింది. ఈ మధ్యనే లిప్ లాక్‌కి కూడా సిద్ధమని ప్రకటన ఇచ్చింది. దీనిపై వివాదం చెలరేగడంతో వివరణ ఇచ్చింది.
 
సాధారణంగా గ్లామర్‌కు అశ్లీలానికి సన్నని తెర ఉందని చెప్పింది. కానీ, తాను ఒకటి చెబితే, మీడియాలో మరొకటి వచ్చిందని తెలిపింది. సినిమా ప్రేక్షకుల అభిరుచుల్లో తేడా వచ్చిందని పేర్కొంది. ప్రేక్షకులు గ్లామర్, అశ్లీలానికి మధ్య తేడాను గుర్తిస్తారని చెప్పింది. 
 
గ్లామర్ పేరుతో చిట్టిపొట్టి డ్రెస్సులు వేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించే తాను లిప్ లాక్‌ను ఎలా అంగీకరిస్తానని తిరిగి ప్రశ్నించింది. సినిమా అవకాశాలు లేకపోతే ఇంట్లో కూర్చుంటానే తప్ప కుటుంబం మొత్తం చూడలేని సినిమాలు చేయలేనని స్పష్టం చేసింది. అలా అని తాను గ్లామర్ పాత్రలను అంగీకరించనని కాదని, గ్లామర్ వేరు అశ్లీలం వేరు అని చెప్పింది. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
రజినీకాంత్ కొత్త చిత్రం ఆడియోకు రూ.25 కోట్లు ఖర్చు