1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Ram Charan’s next: Buchi Babu to cast big names

#RC16: క్రీడాకారుడిగా రామ్ చరణ్.. విజయ్ సేతుపతి కూడా..

Ramcharan
స్టార్ హీరో రామ్ చరణ్, దర్శకుడు బుచ్చి బాబు సనా #RC16గా తెరకెక్కనున్న పేరులేని చిత్రంగా  ఇది రూపుదిద్దుకుంటోంది. ఉప్పెన దర్శకుడి స్క్రిప్ట్, కథనంతో ఇంప్రెస్ అయిన రామ్ చరణ్ ఈ సినిమాని ఓకే చేయడానికి రెండుసార్లు ఆలోచించలేదు. ఈ ఎమోషనల్ డ్రామాలో చెర్రీ క్రీడాకారుడుగా నటించనున్నాడు.
 
ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చేందుకు ఎంపికయ్యారు. ఇదిలా ఉంటే బుచ్చిబాబు నటీనటుల కోసం ప్రయత్నిస్తున్నారు.  హీరోయిన్ కోసం బాలీవుడ్ నటితో చర్చలు జరుపుతున్నాడు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించే అవకాశం ఉంది.  విజయ్ సేతుపతి తొలి చిత్రం "ఉప్పెన"లో కూడా కనిపించాడు.  
 
ఇకపోతే.. రెగ్యులర్ షూట్ డిసెంబర్ 2023 లేదా జనవరి 2024లో ప్రారంభమవుతుంది. ఎందుకంటే దర్శకుడు శంకర్ ఇంకా "గేమ్ ఛేంజర్" షూటింగ్‌ను ముగించలేదు. రామ్ చరణ్ మరో రెండు నెలల పాటు ఈ ప్రాజెక్ట్‌పై వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బుచ్చిబాబు సినిమాలో తను చేయబోయే పాత్ర కోసం మేకోవర్ చేయాల్సి ఉంటుంది.  
About Writer
సెల్వి
తర్వాతి కథనం
స్నానం చేస్తుంటే న్యూడ్‌గా శరీరాన్ని షూట్ చేశాడు.. భర్తపై రాఖీ సావంత్ ఆరోపణలు