గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 ఆగస్టు 2023 (11:39 IST)

పెళ్లి చేసుకోవడం వేస్ట్.. చెర్రీతో ఆ ఛాన్స్ వస్తే వదులుకోను.. సరయు

sarayu
యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ గర్ల్ సరయు పెళ్లిపై తన నిజాయితీగా తన అభిప్రాయాన్ని చెప్పింది. సినిమా సమీక్షలు అడల్ట్ కామెడీ స్కిట్‌లతో సరయు యూట్యూబ్ స్టార్‌గా మారింది. అలాగే బిగ్ బాస్ షోపై కూడా సరయు చేసిన కామెంట్స్ గతంలో వైరల్ అయ్యాయి. 
 
బిగ్ బాస్ షో ఫేక్ అని, డబ్బుతో షో నడుస్తుందని, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే టైటిల్ వస్తుందని సరయు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్ల నుంచి కూడా రకరకాల వ్యాఖ్యలు వినిపించాయి.
 
తాజాగా పెళ్లి గురించి, హీరో రామ్ చరణ్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సరయు, పెళ్లిపై తనకు పెద్దగా నమ్మకం లేదని, పెళ్లి చేసుకోవడం వేస్ట్ అని చెప్పింది. పైగా ఆమెకు పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదని క్లారిటీ ఇచ్చేసింది. 
 
అంతేగాకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెళ్లి రోజున తాను చాలా ఏడ్చేశానని, రామ్ చరణ్ అంటే తనకు చాలా ఇష్టమని, రామ్ చరణ్‌తో డేటింగ్ చేసే అవకాశం వస్తే వదులుకోనని సరయు ఓపెన్‌గా చెప్పింది. మెగా పవర్ స్టార్‌పై ఆమె చేసిన వ్యాఖ్యకు రకరకాల సమాధానాలు వస్తున్నాయి.