గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 ఆగస్టు 2023 (19:37 IST)

రాహుల్ గాంధీని పెళ్లి చేసుకునేందుకు రెడీ.. కానీ ఒక కండిషన్?

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పెళ్లి చేసుకునేందుకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ షెర్లిన్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 50 ఏళ్లు దాటినా ఇంకా బ్రహ్మచారిగానే ఉన్న రాహుల్‌ను వివాహం చేసుకునేందుకు రెడీ అవుతున్నట్లు ఆమె తెలిపింది. రాహుల్ ఓకే అంటే తాను పెళ్లికి రెడీ అని షెర్లిన్ తెలిపింది. 
 
రాహుల్ గాంధీ అంటే పడిచచ్చిపోతానని షెర్లిన్ చోప్రా వెల్లడించింది. అయితే రాహుల్‌ను పెళ్లి చేసుకున్నప్పటికీ తన ఇంటి పేరులో మార్పు ఉండదని షెర్లిన్ చోప్రా కండిషన్ పెట్టింది. ఈ కండిషన్‌కు రాహుల్ అంగీకరిస్తే పెళ్లి చేసుకునేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతోంది.