శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 ఆగస్టు 2023 (08:58 IST)

భర్త చనిపోయిన మహిళతో ప్రేమాయణం.. పెళ్లి మాటెత్తగానే ట్యాంకర్ కింద తోసి చంపేసిన ప్రియుడు

pramila
హైదరాబాద్ నగరంలోని బాచుపల్లిలో వాటర్ ట్యాంకర్‌ ఢీకొట్టి చనిపోయిన ప్రమీల అనే మహిళ మృతి కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. ప్రేమించిన యువకుడే ఆమెను ట్యాంకర్ కింద తోసి చంపేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇందుకు సంబంధించిన కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం నెమలిగుట తండాకు చెందిన భుక్తా ప్రమీల అనే యువతి కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చింది. గత యేడాది ఆమెకు వివాహం కాగా ఏప్రిల్ నెలలో ఆమె భర్త చనిపోయాడు. ఆ తర్వాత ఆమె బాచుపల్లిలోని ఓ స్టీలు దుకాణంలో పనిచేస్తూ, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటూ జీవనం సాగిస్తూ వచ్చింది. 
 
ఈ క్రమంలో ప్రమీల సొంతూరుకు చెందిన భూక్యా తిరుపతి నాయక్‌తో ప్రమీలకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. భర్తను కోల్పోయిన ప్రమీల.. తిరుపతికి దగ్గరైంది. అయితే, అతడు ఇటీవల ప్రమీలను మోసం చేసి మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రమీల తనను పెళ్లి చేసుకోవాలని, లేకపోతే, ఇంట్లో చెబుతానంటూ ఒత్తిడి చేయసాగింది. 
 
ఇదే విషయంపై చర్చించేందుకు ఆదివారం కలుద్దామని ప్రమీల తిరుపతితో చెప్పింది. ఈ క్రమలో తిరుపతి మరో స్నేహితుడితో ద్విచక్రవాహనంపై బాచుపల్లి రహదారి వద్ద ఉన్న ఆమె వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో పెళ్లి విషయంపై వారిద్దరి మధ్య మరోమారు వాదోపవాదాలు జరగడంతో క్షణికావేశానికి లోనైన తిరుపతి... సరిగ్గా అటువైపు వస్తున్న ట్యాంకర్ లారీ కింద తోసేశాడు. దీంతో ఆమె ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. ప్రమీల ప్రమాదవశాత్తు మణించిందని నమ్మించే ప్రయత్నించిన తిరుపతి.. చివరకు పోలీసుల తమదైనశైలిలో ప్రశ్నించడంతో తిరుపతి నేరాన్ని అంగీకరించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.