సందట్లో సడేమియా... కృష్ణా పుష్కరాల్లో వర్మ 'వంగవీటి' చిత్రం షూటింగ్
ఇటీవల వరుస వివాదాలతో వార్తల్లోకి ఎక్కుతున్న సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా మరో వివాదానికి కేంద్ర బిందువు అయ్యారు. రాంగోపాల్ వర్మ ఏ పని చేసినా, ఏం మాట్లాడినా వివాదంగా మారుతుంది. ఇదిలావుంటే వర్మ
ఇటీవల వరుస వివాదాలతో వార్తల్లోకి ఎక్కుతున్న సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా మరో వివాదానికి కేంద్ర బిందువు అయ్యారు. రాంగోపాల్ వర్మ ఏ పని చేసినా, ఏం మాట్లాడినా వివాదంగా మారుతుంది. ఇదిలావుంటే వర్మ ఈ సారి కృష్ణా పుష్కరాల మీద మనసు పారేసుకున్నాడు.
పుష్కరాల హంగామా గమనించిన దర్శకుడు రాంగోపాల్ వర్మ దీన్ని క్యాష్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎలాగంటే... తెలుగులో తన చివరి చిత్రమని ప్రకటించిన ''వంగవీటి'' సినిమా షూటింగ్ కోసం ఈ పుష్కరాలను వాడుకోనున్నట్టు టాలీవుడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం.
గెరిల్లా షూటింగ్ ప్రక్రియ ద్వారా షూటింగ్ జరుగుతున్న విషయం తెలియకుండానే తనకి కావలసిన పార్ట్‌ని, తనకు కావలసిన సన్నివేశాలను షూట్ చేసుకుంటూ తన పని కానిచ్చుకోవడానికి ఈ దర్శకుడు సన్నాహాలు చేస్తున్నాడట. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో పుష్కరాలను ఏవిధంగా ఉపయోగించుకుంటాడోని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

