సంబంధిత వార్తలు
- "విజు" అభిప్రాయం, సలహా తీసుకుంటాను.. రష్మిక మందన్న
- పుష్ప-2 కౌంట్‌డౌన్ పోస్టర్.. 200 రోజుల పోస్టర్ రిలీజ్
- 200 రోజులలో పుష్ప పాలన రాబోతుందంటూ లేటెస్ట్ అప్డేట్
- రియల్ ఇన్సిడెంట్స్ కథగా అంబాజీపేట మ్యారేజి బ్యాండు : నిర్మాత ధీరజ్ మొగిలినేని
- రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో.. ఆ పాడు పనికి పాల్పడింది గుంటూరు జిల్లా వాసే..
సౌందర్య బయోపిక్‌లో రష్మిక మందన్న?
సౌందర్య స్థానాన్ని ఇప్పటి హీరోయిన్లలో ఎవరూ భర్తీ చేయలేరనే చెప్పాలి. ఆమె నటన, అందం ప్రేక్షకులకు ఇట్టే కట్టిపడేస్తుంది. అలాంటి సౌందర్య విమాన ప్రమాదంలో దివి కేగిన సంగతి తెలిసిందే. ఆ లోటును సినీ ఇండస్ట్రీలో ఎవరూ భర్తే చేయలేకపోతున్నారనే చెప్పాలి.
ప్రస్తుతం హీరోయిన్లు గ్లామర్ డోస్ ఎక్కువగా ప్రదర్శించాల్సి వుంది. దీంతో సౌందర్య లాంటి అందం, అభినయం కాస్త దూరమైందనే చెప్పాలి. తాజాగా సౌందర్య బయోపిక్ తీయాలని చాలామంది నిర్మాతలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు.
కానీ ఎవరూ ఇంతవరకు ఆ ప్రాజెక్ట్‌ని లాంచ్ చెయ్యలేదు. హీరోయిన్ రష్మిక మందన్న మాత్రం ఎవరు సౌందర్య బయోపిక్‌ని తీసినా తాను నటించేందుకు రెడీ అంటోంది. ఆమెకి సౌందర్య అంటే ఇష్టం. ఇద్దరూ కన్నడిగులే.
సౌందర్య ఎలా తెలుగులో పెద్ద స్టార్ అయ్యారో ఇప్పుడు రష్మిక తెలుగులో అగ్ర కథానాయికగా ఎదిగింది. అలాంటి హీరోయిన్ బయోపిక్‌లో నటించడం తన డ్రీమ్ అని వెల్లడించింది.
