1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 జనవరి 2024 (23:08 IST)

పుష్ప-2 కౌంట్‌డౌన్ పోస్టర్‌.. 200 రోజుల పోస్టర్ రిలీజ్

Pushpa 2
"పుష్ప-2" నిర్మాతలు కౌంట్‌డౌన్ పోస్టర్‌ను విడుదల చేశారు. విడుదల తేదీలో మార్పు లేదని నిర్ధారించారు. 200 రోజుల్లో సినిమాను విడుదల చేయనున్నట్టు పోస్టర్‌లో పేర్కొన్నారు. "పుష్ప 2, పుష్ప సీక్వెల్. భారీ అంచనాలతో విడుదల కానున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో వుంది. 
 
ఈ సినిమా ఆగస్టు 15, 2024న విడుదలవుతుందని ప్రకటించారు. అయితే దేవర వంటి ఇతర పెద్ద సినిమా విడుదలైతే.. పుష్ప-రీ-షెడ్యూల్ చేయబడే సూచనలు ఉన్నాయనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ఊహాగానాలను తిప్పికొట్టేలా.. విడుదలకు 200 రోజులు మిగిలి ఉన్నాయని మేకర్స్ కౌంట్‌డౌన్ పోస్టర్‌ను విడుదల చేశారు.
Pushpa 2
Pushpa 2
 
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్ తదితరులు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ దీనిని నిర్మిస్తోంది.