1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 29 జనవరి 2024 (13:38 IST)

గ్యాంగ్ స్టర్ గా విజయ్ దేవరకొండ మారబోతున్నాడా !

Vijay Deverakonda, gangster
Vijay Deverakonda, gangster
విజయ్ దేవరకొండ 12 వ సినిమా గురించి అభిమానుల్లో పెద్ద చర్చే జరుగుతుంది. ఖుషి సినిమా తర్వాత ఫ్యామిలీ స్టార్ గా మారి అలరించే పనిలో వున్నారు. ఆ సినిమా షూట్ ముగింపు దశలో వుంది. కాగా, ఆమధ్య VD12 గురించి నిర్మాత నాగవంశీ ఓ హిట్ ఇచ్చాడు. అది త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈలోగా నెటిజన్లు పెద్ద ఆసక్తి చూపడంతో దీనిపై ఈరోజు క్లారిటీ ఇచ్చాడు.
 
ఫ్యామిలీ స్టార్ చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత #VD12 షూట్ మళ్లీ ప్రారంభమవుతుంది.  ఇందులో శ్రీలీల నాయికగా నటిస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ పోస్టర్ కూడా విజయ్ టీమ్ విడుదల చేసింది. ఇందులో గ్యాంగ్ స్టర్ గా విజయ్ దేవరకొండ కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ గ్యాంగ్ స్టర్ హాలీవుడ్ స్టయిల్ లో కనిపించే గ్యాంగ్ స్టర్ గా వుంటుందని తెలుస్తోంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.