బుధవారం, 6 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 జనవరి 2024 (15:57 IST)

"ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్" ముమ్మాటికీ మాదే.. డీవీవీ దానయ్య

original gangster
పవన్ కళ్యాణ్ హీరో సుజీత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం "ఓజీ" (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య తన సొంత బ్యానర్ డీవీవీ ప్రొడక్షన్స్‌పై నిర్మిస్తున్నారు. అయితే, ఇపుడు ఈ ప్రొడక్షన్ హౌస్ మారిందంటూ ప్రచారం సాగుతుంది. నిర్మాణ బాధ్యతలు మరో నిర్మాణ సంస్థ చేతికి వెళ్లాయంటూ ఫిల్మ్ నగర్‌లో జోరుగా ప్రచారం సాగుతుంది. దీనిపై డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ స్పందించింది.
 
"ఓజీ" మా సినిమా. ఎప్పటికీ మాదే. ఈ సినిమా ఉండబోతుందే మాకు స్పష్టత ఉంది. ఆ దిశగా ముందుకుసాగుతున్నాం. ఆకలితో ఉన్న చిరుత దేనిని వదిలిపెట్టదు" అంటూ ట్వీట్ చేసింది. ముంబై - జపాన్ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతుంది. పవన్ సరకన్ ప్రియాంకా మోహన్ నటిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్‌లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. 
 
'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడో తెలుసా? 
 
మహష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం "గుంటూరు కారం". ఈ చిత్రం ఈ నెల 12వ తేదీన విడుదల కానుంది. దీన్ని పురస్కరించుకుని ఆదివారం రాత్రి థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇపుడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించే వేడుక తేదీ, ప్రాంతాన్ని ప్రకటించారు. ఈ నెల 9వ తేదీన గుంటూరులో భారీ స్థాయిలో ఈ  ప్రీ రిలీజ్ ఈవెంట్‌‍ను నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించింది. వాస్తవానికి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 6వ తేదీన హైదరాబాద్ నగరంలో ప్లాన్ చేశారు. కానీ, పోలీసుల నుంచి అనుమతులు లభించకపోవడంతో 9వ తేదీకి వాయిదా వేశారు. 
 
గుంటూరులోని నంబూరు క్రాస్ రోడ్స్‌కు సమీపంలో భారత్ పెట్రోల్ బంకు పక్కన ఈ వేడుకను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఈ ఈవెంట్ ప్రారంభంకానుంది. మహేశ్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు నటించిన ఈ చిత్రం 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. కాగా, ఆదివారం రాత్రి విడుదలైన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ సోషల్ మీడియాలో మోత మోగిస్తుంది. కేవలం 12 గంటల వ్యవధిలోనే రెండున్నర కోట్ల వ్యూస్ సాధించింది.