1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 జనవరి 2024 (09:26 IST)

ఫిబ్రవరిలో పెళ్లి లేదు.. దొరికితే చాలు చేసేస్తారు.. విజయ్ దేవరకొండ

Rashmika Mandanna & Vijay Deverkonda
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఎట్టకేలకు రష్మిక మందన్నతో ఎంగేజ్‌మెంట్ పుకార్లపై మౌనం వీడాడు. ఫిబ్రవరిలో పెళ్లి లేదు.. ఎంగేజ్మెంట్ లేదని స్పష్టం చేశాడు. ప్రతి రెండేళ్లకోసారి తనకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. తన పెళ్లికి సంబంధించిన పుకార్లు వింటూనే వున్నాను. దొరికితే చాలు తనను పట్టుకుని పెళ్లి చేసేందుకు సిద్ధంగా వున్నారని విజయ్ దేవర కొండ అన్నాడు.
 
  ఎప్పట్లాగానే ఇటీవల విజయ్ దేవరకొండ, రష్మికపై కొన్ని ఊహాగానాలు వచ్చాయి. ప్రతి రెండేళ్లకోసారి నాకు పెళ్లి చేయాలని కొన్ని మీడియా సంస్థలు భావిస్తున్నాయని ఎద్దేవా చేశారు.
 
ఇటీవల, రష్మిక, విజయ్ మాల్దీవుల పర్యటన ఫిబ్రవరి రెండవ వారంలో వారి నిశ్చితార్థ వేడుక జరుగుతుందనే పుకార్లకు ఆజ్యం పోసింది. కానీ వీటిలో నిజం లేదని విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చేశాడు.