సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 18 జనవరి 2024 (15:48 IST)

ధనుష్ పై కీలక సన్నివేశాలతో చిత్రాన్ని ప్రారంభించిన శేఖర్ కమ్ముల

Dhanush enters opeing
Dhanush enters opeing
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న కథానాయికగా నటించనున్న సినిమా నిన్న;పూజతో లాంఛనంగా ప్రారంభమైంది. . శ్రీ నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (ఏషియన్ గ్రూప్ యొక్క యూనిట్), అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ బ్యానర్స్ పై సునీల్ నారంగ్,  పుస్కుర్ రామ్ మోహన్ రావులు నిర్మిస్తునారు. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
 
Shekhar Kammula, Dhanush, Puskur Ram Mohan Rao
Shekhar Kammula, Dhanush, Puskur Ram Mohan Rao
పూజా కార్యక్రమానికి సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, భరత్ నారంగ్, జాన్వీ నారంగ్ తదితరులు హాజరయ్యారు. ధనుష్‌తో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడంతో రెగ్యులర్ షూటింగ్ నిన్న ప్రారంభమైంది.
 
ధనుష్, నాగార్జునలు సంక్రాంతికి వచ్చిన తమ చిత్రాలు కెప్టెన్ మిల్లర్ (తమిళం) నా సామి రేంజ్‌తో బ్లాక్‌బస్టర్‌లను అందించడంతో ఈ ఎపిక్ మల్టీ-స్టారర్ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న ఎక్సయిమెంట్ రెట్టింపు అయ్యింది. ఇద్దరు స్టార్స్ ని బిగ్ స్క్రీన్స్ పై కలసి చూడటాని అభిమానులు ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది.
 
రెండు బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్‌బస్టర్స్ ఫిదా, లవ్ స్టోరీని రూపొందించిన తర్వాత శేఖర్ కమ్ముల బిగ్ కాన్వాస్‌పై యూనిక్ కథతో ఈ మల్టీస్టారర్ ని రూపొందిస్తున్నారు. టెక్నికల్‌ పరంగానూ సినిమా సాలిడ్‌గా ఉండబోతోంది. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో మేకర్స్ అనౌన్స్ చేస్తారు.