గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 20 డిశెంబరు 2023 (14:32 IST)

కె. రాఘవేంద్రరావుకి నడుం నొప్పి రావడానికికి కారణం అదేనట!

K.Raghavendra Rao
K.Raghavendra Rao
సినిమా దర్శకుడి అంటే అన్నీ తానే అయి చూసుకోవాలి. టెక్నీషియన్స్ ను సరిగ్గా ఎంచుకోవాలి. ఆ తర్వాత షాట్ లో ఎవరు ఎలా వుండాలి కూడా చూసుకోవాలి. అందుకే సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు ఇన్ని పనులు చేయడం మంటే నడుం పడిపోతుందని తన అనుభవసారాంశం వెల్లడించారు. తాజాగా ఆయన నిర్మాతగా సర్కారు నౌకరి సినిమా నిర్మించారు. ట్రైలర్ నేడు హైదరాబాద్ లో విడుదలయింది. ఈ సంధర్భంగా శేఖర్ కమ్ముల, అనిల్ రావిపూడి అతిథులుగా విచ్చేశారు.
 
వారినుద్దేశించి రాఘవేంద్రరావు ఇలా అన్నారు. నేను బిజీగా వున్న రోజుల్లో నడుం నొప్పి వుండేది. విదేశాల్లో ఎక్కడికి వెళ్ళినా అక్కడ డాక్టర్ పేరును బట్టి చూపించుకునేవాడిని. అందరూ రెస్ట్ తీసుకోండని చెప్పేవారు. అలా చేస్తే డబ్బులు ఎలా వస్తాయి అనేవాడిని. అలా ఓసారి అమెరికాకు వెళ్ళాను. ఫేమస్ డాక్టర్ ను తెలిసిన వారి రిమండేషన్ తో వెళ్ళి చూపించుకున్నాను. అన్ని టెస్ట్ లు చేశారు. మీరు ఏ పని చేస్తారని అడిగారు. దర్శకుడు అని చెప్పాను. చివర్లో మా పేరు వస్తుంది అనేవాడిని. అదికాదు. కథ, డైలాగ్ లు, సంగీతం, కెమెరా షాట్, పాటలు ఇవి చూసేది ఎవరు అని అడిగారు. అన్నీ నేనే అన్నాను. 
 
అయితే కెమెరా షాట్ ఎలా తీస్తారో చూపించండి అన్నారు. షాట్ సన్నివేశాన్ని బట్టి ఇలా అళా అని కూర్చుని నొలుచొని, వంగి యాక్షన్ చెపుతానని చెప్పాను. దాంతో ఆయన, ఏదో ఒకటి చేయండి అన్నారు. ఏడాదికి 8 సినిమాలు చేసేవాడిని అన్నా. దాంతో ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, ఏడాది ఒకటి చేయండి చాలు అని సలహా ఇచ్చారు. ఆ రోజుల్లో పరిస్థితిని బట్టి ఒక సినిమా రన్నింగ్ లో వుండగానే, రామారావు, శోభన్ బాబు,  క్రిష్ణ గారి సినిమాలు వరుసగా వుండేవి. అందుకే 110 సినిమాలు తీయగలిగాను అన్నారు. అందుకే శేఖర్ కమ్ముల, అనిల్ రావిపూడి మీరు కూడా జాగ్రత్తగా చూసుకోండని సూచించారు. దాంతో అందరూ నవ్వుకుని అలాగే అంటూ సమాధానమిచ్చారు.