గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : బుధవారం, 20 డిశెంబరు 2023 (16:06 IST)

అన్నమయ్యతో సహా అన్ని రకాల సినిమాలు చేయడమే నా జీవితంలో పెద్ద తృప్తి : రాఘవేంద్రరావు

Shekhar Kammula, Raghavendra Rao, Anil Ravipudi, sunitha and others
Shekhar Kammula, Raghavendra Rao, Anil Ravipudi, sunitha and others
ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయవుతున్న సినిమా "సర్కారు నౌకరి". ఈ చిత్రంలో భావన హీరోయిన్ గా నటిస్తోంది. సర్కారు నౌకరి చిత్రాన్ని ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. "సర్కారు నౌకరి" సినిమా న్యూఇయర్ సందర్భంగా వచ్చే జనవరి 1న థియేటర్స్ లో ఘనంగా విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు వీఎన్ ఆదిత్య, రైటర్ బీవీఎస్ఎన్ రవి, సినిమా టీమ్ మెంబర్స్ పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ - నేను దర్శకుడిగా ఏడాదికి ఏడెనిమిది సినిమాలు చేసిన సందర్భాలున్నాయి. ఇప్పడు ట్రెండ్ మారింది. శేఖర్ కమ్ముల, అనిల్ రావిపూడి లాంటి దర్శకులు రెండేళ్లు, మూడేళ్లకు సినిమాలు చేస్తున్నారు. అయినా వారి సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తునే ఉన్నారు. అంటే శేఖర్, అనిల్ ప్రేక్షకుల్ని ఎంతగా తమ దర్శకత్వ ప్రతిభతో ఆకట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. రొటీన్ ఫార్మేట్ కథలకు భిన్నంగా సినిమాలు చేసి విజయం సాధించవచ్చని శేఖర్ కమ్ముల ప్రూవ్ చేశాడు. ఆయన ఆనంద్, హ్యాపీడేస్ మూవీస్ నాకు ఎంతో ఇష్టం. అనిల్ రావిపూడి పటాస్ తో మొదలై ఇవాళ బాలకృష్ణతో భగవంత్ కేసరి లాంటి సూపర్ హిట్ మూవీ చేశాడు. రేపు మెగాస్టార్ తో సినిమా చేస్తాడు. అతను నాకు ఇష్టమైన దర్శకుడు.  నా చేతుల మీదుగా ఎంతో మంది కొత్త నటీనటులను పరిచయం చేశాను. వెంకటేష్, మహేశ్ బాబు, ఎన్టీఆర్ వంటి హీరోలను ఇంట్రడ్యూస్ చేశాను. వారంతా ఇప్పుడు గొప్ప పొజిషన్ లో ఉన్నారు. 

"సర్కారు నౌకరి" సినిమాతో పరిచయం చేస్తున్న ఆకాష్ కూడా హీరోగా అలాంటి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో అతని పర్ ఫార్మెన్స్ చూసిన తర్వాత మరే హీరో ఈ కథకు న్యాయం చేయలేడు అనిపించింది. అలాగే హీరోయిన్ భావన నటన మీద ఆసక్తి గల అమ్మాయి. ఆమె నటన చూస్తే మహానటి సావిత్రిలా పేరు తెచ్చుకుంటుంది అనిపించింది. పంచతంత్ర కథలు చూశాక శేఖర్ ను పిలిచి చెక్ ఇచ్చాను. ఆయన షాక్ అయ్యాడు. అవును నువ్వే మా బ్యానర్ లో సినిమా చేస్తున్నావని చెప్పాను. అంత బాగా పంచచంత్ర కథలతో నన్ను ఇంప్రెస్ చేశాడు. ఈ సినిమాలో తనికెళ్ల భరణి, ఇతర నటీనటులు అందరూ చక్కగా నటించారు. వీఎన్ ఆదిత్య నాకోసం ఈ సినిమా మేకింగ్ లో ఎంతో సపోర్ట్ చేశారు. అన్నీ దగ్గరుండి చూసుకున్నారు.  "సర్కారు నౌకరి" కు మంచి టీమ్ కుదిరారు. మ్యూజిక్ సందీప్ బింబిసార సినిమాకు కీరవాణి దగ్గర పనిచేశాడు. ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు.  "సర్కారు నౌకరి" మీకు నచ్చుతుంది. థియేటర్స్ లో చూడమని కోరుతున్నా. ఈ సినిమాను నేను ప్రొడ్యూస్ చేశాను. ఒక్క షాట్ కూడా డైరెక్షన్ చేయలేదు. మొత్తం శేఖర్ చేసుకున్నాడు. "సర్కారు నౌకరి" నా తరహా మూవీ కాదు. గతంలో ఇలాంటి కంటెంట్ తో నేనూ సినిమాలు చేశాను గానీ. ఇందులో ఎమోషనల్ గా స్టోరీ వెళ్తుంది. నేను అన్ని మూవీస్ చూస్తాను. అందుకే ఇప్పుడున్న డైరెక్టర్స్ తో పరిచయాలు పెరిగాయి. బాగున్న సినిమాల డైరెక్టర్స్ కు ఫోన్ చేసి మాట్లాడుతుంటా. కమర్షియల్ గా చేసిన అన్ని సినిమాలు ఆడాలని లేదు. వందల మంది ఫైటర్స్ ను హీరో ఒక్కడే కొట్టిన సినిమాలు కూడా ఆదరణ పొందడం లేదు. దర్శకుడిగా నా జీవితంలో పెద్ద తృప్తి ఏంటంటే అన్నమయ్య లాంటి భక్తిరస కథలు సహా అన్ని రకాల సినిమాలు చేయగలిగాను. అన్నారు.
 
డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ -  "సర్కారు నౌకరి" సినిమా ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. ఒక నేచురల్ అట్మాస్పియర్ లో చేసిన సినిమా ఇది. ఆకాష్, భావన, డైరెక్టర్ శేఖర్, సునీత గారికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. న్యూ ఇయర్ రోజున మీ సినిమా రిలీజ్ అవుతోంది. మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు మాకు గురువు లాంటి వారు. ఆయన సినిమాలు చూసి పెరిగి, ఇండస్ట్రీకి వచ్చిన మాకు ఆయన నుంచి చిన్న ప్రశంస దక్కినా అది పెద్ద అఛీవ్ మెంట్ లా భావిస్తాం. మమ్మల్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటారు. థ్యాంక్యూ గురువు గారు. రెండేళ్లకు సినిమా చేసినా మా మీద చాలా ప్రెషర్ ఉంటోంది. ఇవాళ ఆడియెన్స్ కు సినిమా నాలెజ్డ్ గా బాగా పెరగడమే కారణం అనుకుంటున్నా. అన్నారు.
 
డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ - ఇక్కడికి వచ్చాక రాఘవేంద్రరావు గారితో మాట్లాడుతూ అన్నాను. మీరు చేసిన బ్లాక్ బస్టర్స్ ఈ టైమ్ లో చేసి ఉంటే ఛార్టెడ్ ఫ్లైట్ లో తిరిగేవారు..మీ సినిమాలు అంత కలెక్ట్ చేసేవి అన్నాను. రాఘవేంద్రరావు గారు మా గురించి ప్రశంసిస్తూ మాట్లాడుతుంటే హ్యాపీగా ఉంది. ఆయనది లక్కీ హ్యాండ్ ఈ సినిమా మంచి హిట్ కావాలి. "సర్కారు నౌకరి" ట్రైలర్ బాగుంది. తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేశారు. కొత్త వాళ్లు నటించేప్పుడు కొంత బెరుకు ఉంటుంది. ఆకాష్ అనుభవం ఉన్న నటుడిలా పర్ ఫార్మ్ చేశాడు. దర్శకుడు శేఖర్ మూవీని ఆకట్టుకునేలా చేశాడు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
 
తనికెళ్ల భరణి మాట్లాడుతూ - రాఘవేంద్రరావు గారు చేసిన దాదాపు అన్ని సినిమాల్లో నేనున్నాను. ఆయన టాలీవుడ్ కు ఒక వటవృక్షం లాంటి వాళ్లు. ఆయన నీడలో ఎంతోమంది ఎదిగారు.  "సర్కారు నౌకరి" సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. కొంత విలనీ షేడ్ తో ఉంటుంది. ఈ సినిమా కథను దర్శకుడు శేఖర్ చెప్పినప్పుడు సర్ ప్రైజ్ అయ్యాను. మంచి సోషల్ ఎలిమెంట్ ను ఎంటర్ టైన్ మెంట్ తో కలిపి ఆయన రూపొందించాడు. ఆకాష్ నటన ఆకట్టుకుంటుంది. అన్నారు.
 
డైరెక్టర్, రైటర్ బీవీఎస్ఎన్ రవి మాట్లాడుతూ - మన సమాజంలో ఎన్నో రుగ్మతలు ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడుకునేందుకు ఇష్టపడం. అలా మనం వ్యవహరించడం వల్లే ఏళ్లుగా ఆ రుగ్మతలు మన సమాజంలో పేరుకుపోయాయి. అలాంటి ఒక ఇష్యూ గురించి ఈ సినిమాలో దర్శకుడు శేఖర్ డిస్కస్ చేస్తున్నాడు. మెసేజ్, ఎంటర్ టైన్ మెంట్ రెండూ కలిసి ఉన్న సినిమా  "సర్కారు నౌకరి". సినిమా చూశాను. ఆకాష్, భావన, ఇతర కాస్ట్ అండ్ క్రూ పర్ ఫెక్ట్ గా చేశారు. అన్నారు.
 
డైరెక్టర్ వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ - టాలీవుడ్ కు దక్కిన ఒక ట్రెజర్ రాఘవేంద్రరావు గారు. ఆయన నిర్మాణంలో చేసిన  "సర్కారు నౌకరి" సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నా. ఆకాష్ యాక్టింగ్ రీల్స్, వీడియోస్ చూశాను. చాలా ఇంప్రెసివ్ గా చేశాడు. ఈ సినిమాలో ఆయన పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది.  "సర్కారు నౌకరి"  సినిమా మరో ముప్ఫై నలభై ఏళ్ల పాటు ఈ టీమ్ అందరికీ ఇండస్ట్రీలో నౌకరి ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
లిరిక్ రైటర్ సిరాశ్రీ మాట్లాడుతూ -  "సర్కారు నౌకరి" సినిమాకు పనిచేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నా. ఎందుకంటే రాఘవేంద్రరావు గారి లాంటి లెజెండ్ దగ్గర వర్క్ చేయడం అనేది అరుదైన అవకాశం. చాలా జాగ్రత్తగా ఈ మూవీకి వర్క్ చేశాం.  "సర్కారు నౌకరి"  సినిమా మీ అందరికీ నచ్చుతుందని నమ్మకంతో చెప్పగలను. అన్నారు.
 
సింగర్ సునీత మాట్లాడుతూ - నాకు ఒక జీవితానికి సరిపడా సంతృప్తినిచ్చిన సినిమా ఇది. కెరీర్ లో మొదటి సినిమా అంటే ఎవరికైనా ప్రత్యకమే. అలాంటి స్పెషల్ మూవీని మా అబ్బాయికి అందించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారికి, దర్శకుడు శేఖర్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాం.  "సర్కారు నౌకరి"  సినిమాలో మా అబ్బాయి ఆకాష్ ఫస్ట్ మూవీ అయినా అనుభవం ఉన్నవాడిలా నటించాడనే ప్రశంసలు వింటుంటే చాలా సంతోషంగా ఉంది. ఆకాష్ తో పాటు భావన, ఇతర టీమ్ అంతా కష్టపడి పనిచేశారు. డైరెక్టర్ శేఖర్ గారు రచన, సినిమాటోగ్రఫీ బాధ్యతలు కూడా వహించారు. కొత్త ఏడాదిలో విడుదలవుతున్న ఫస్ట్ మూవీ మాదే. మీ అందరూ  "సర్కారు నౌకరి" మూవీని ఆదరిస్తారని కోరుకుంటున్నా. అలాగే మా సినిమాకు సపోర్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి మీడియా సమక్షంలో థ్యాంక్స్ చెబుతున్నా. మా అబ్బాయి కూడా నాలాగా బాగా పాడుతాడు. అయితే సింగింగ్ ను వారసత్వంగా తీసుకుని సక్సెస్ అయిన వారు చాలా  తక్కువ మంది. ప్లేబ్యాక్ సింగింగ్ ఒక యూనిక్ ఆర్ట్. ఇందులో అందరూ సక్సెస్ కాలేరు. ఆకాష్ పాడగలిగినా అతనికి యాక్టింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండటంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. అని చెప్పింది
 
డైరెక్టర్ గంగనమోని శేఖర్ మాట్లాడుతూ - దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు లేకుంటే ఈ సినిమా లేదు. ఇలాంటి కథ బయటకు రాదు. ఆయన నాకు ఫస్ట్ డే చెక్ ఇచ్చినప్పుడు ఆ సందర్భాన్ని నమ్మలేకపోయాను. "సర్కారు నౌకరి" సినిమాను అనుకున్నట్లుగా పూర్తి చేశామంటే అందుకు రాఘవేంద్రరావు గారి సపోర్ట్ కారణం. ఆకాష్ హీరోగా కాదు నాకు ఒక ఫ్రెండ్ గా మారిపోయాడు. భావన ఈ సినిమా స్క్రిప్ట్ మొత్తం యాక్ట్ చేసి చూపగల సమర్థురాలు. మంచి నటి. మేకింగ్ లో నాకు వీఎన్ ఆదిత్య గారు ఎంతో సపోర్ట్ చేశారు. నా కంటే ఎక్కువ పరుగులు పెట్టి సినిమా కంప్లీట్ చేసేందుకు సపోర్ట్ చేసిన మా డైరెక్షన్ టీమ్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించాం. కొల్లాపూర్ లో ఎక్కువ  షూటింగ్ జరిపాం. అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ పీసపాటి మాట్లాడుతూ - "సర్కారు నౌకరి" సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. దర్శకుడు శేఖర్ నన్ను కలిసినప్పుడు మూవీ కోసం అనుకోలేదు. నేను చేసిన పాటలు ఏవి తనకు ఇష్టమో చెబుతూ మాటల మధ్యలో "సర్కారు నౌకరి" సినిమా గురించి చెప్పాడు. నేను సర్ ప్రైజ్ అయ్యాను. ఈ సినిమాకు మ్యూజిక్ చేయడం మంచి ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. నాకు సపోర్ట్ చేసిన సింగర్స్ అందరికీ థ్యాంక్స్. "సర్కారు నౌకరి" పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
హీరో ఆకాష్ మాట్లాడుతూ - నటుడు కావాలనుకునే ప్రతి ఒక్కరికి తొలి సినిమా అవకాశం ఎంతో ముఖ్యం. అలాంటి అవకాశాన్ని "సర్కారు నౌకరి" సినిమాతో నాకు అందించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారికి, డైరెక్టర్ శేఖర్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. న్యూయర్ రోజున జనవరి 1 "సర్కారు నౌకరి" రిలీజ్ అవుతోంది. మీ దగ్గర్లోని థియేటర్స్ కు వెళ్లి సినిమా చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. చిన్నప్పటి నుంచి నటుడిని కావాలనే ప్యాషన్ ఉండేది. ఉత్తేజ్ గారి మయూఖ ఇన్ స్ట్యూట్ లో రెండు నెలల యాక్టింగ్ కోర్స్ చేశాను. అన్నారు.
 
హీరోయిన్ భావన మాట్లాడుతూ - హీరోయిన్ కావాలనేది నా డ్రీమ్. నేను అనుకున్నది సాధించేందుకు సపోర్ట్ చేసిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్. "సర్కారు నౌకరి" సినిమాలో నటించినప్పుడు నటిగా నేను ఇంకా ఎక్కడ ఇంప్రూవ్ కావాలి అనే విషయాలన్నీ గమనించాను. హీరోయిన్ గా నాకు దక్కిన మంచి అవకాశమిది. నాకు ఈ అవకాశమిచ్చిన రాఘవేంద్రరావు గారు, డైరెక్టర్ శేఖర్ గారికి థ్యాంక్స్. రాఘవేంద్ర రావు గారు ఇంకా మరిన్ని సినిమాలు చేయాలి. మా లాంటి యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్  చేయాలని కోరుకుంటున్నా అన్నారు.