మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శనివారం, 1 మే 2021 (21:03 IST)

మ‌రిదితో శృంగారం చేసే స్టార్ న‌టి? అప్పుడు ఏమ‌యిందంటే!

Deepika Padukone
సినిమారంగంలో ఏదైనా సాధ్యం అవుతుంది. భార్య‌గా ప‌లు ర‌కాల హీరోల‌తో న‌టించే ఛాన్స్ ఇక్క‌డే వుంది. బాలీవుడ్‌లో అది మ‌రింత ఎక్కువ‌. అందుకే అక్క‌డ బోల్డ్ కంటెంట్ క‌థ‌లు వ‌స్తుంటాయి. ఇక ఓ ద‌శ‌లో నెట్‌ఫ్లిక్స్ కొత్త‌గా వ‌చ్చిన రోజుల్లో ఏకంగా నీలి చిత్రాల త‌రహాలో కొన్ని క‌థ‌ల‌తో సినిమాలు వ‌చ్చాయి. అందులో పెద్ద హీరోయిన్లు న‌టించారు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్‌లో దీపిక ప‌దుకొనే ఇలాంటి పాత్ర ఒక‌టి వేయ‌బోతోంద‌ని టాక్ ప్ర‌చారంలో వుంది.
 
ఆ సినిమా క‌థ‌ప‌రంగా త‌న సోద‌రి ల‌వ‌ర్‌తో శృంగారం చేయాల్సి వ‌స్తుంద‌ట‌. ఆ సినిమాలో బోల్డ్ రోల్లో నటిస్తున్నారు. `డాన్‌2` సినిమాను తీసిన షకున్ బాత్రా డైరెక్షన్లో ఈ సినిమా వుండ‌బోతోంది. ఇందులో దీపికా పదుకొనే త‌న సోదరి అయిన అనన్య పాండే లవర్‌తో దీపిక శృంగారం చేస్తుందని తెలుస్తోంది.

ఆ తరువాత కథలో కీలక మలుపులు చోటుచేసుకుంటాయని బాలీవుడ్ వ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి. బ‌హుశా ఇది ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో వుండ‌బోతుందోన‌ని కూడా అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే బాలీవుడ్ కోవిడ్ ఇంకా కోలుకోలేదు. ఇంకెన్ని నెల‌ల ప‌డుతుందో తెలీదు. ఇదిలా వుండ‌గా, ప్రభాస్‌కు జోడీగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో దీపిక న‌టిస్తున్నారు.