శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 జనవరి 2021 (11:51 IST)

దీపికా పదుకునే అంత పని చేసిందా? ఐదున్నర కోట్ల మందిని..?

బాలీవుడ్ హీరోయిన్స్‌లో అత్యధిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న దీపిక పదుకునే ముందు వరుసలో ఉంటుంది అనడంలో సందేహం లేదు. వందలాది హాట్ ఫొటోలను, తన వ్యక్తిగత ఫొటోలను సినిమా ఫొటోలను షేర్ చేసిన దీపిక పదుకునే ఏకంగా 52.5 మిలియన్‌ల ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. 2021 న్యూ ఇయర్ రోజు ఈ భామ జనాలకి షాక్ ఇచ్చింది.
 
దాదాపు అయిదున్నర కోట్ల మంది దీపిక పదుకునేను ఫాలో అవ్వడానికి కారణం ఆమె షేర్ చేసిన ఫొటోలు మరియు వీడియోలు అనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఆ వీడియోలు మరియు ఫొటోలు అన్నింటిని ఆమె తొలగించి ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసింది. తన అకౌంట్ నుండి అన్ని పోస్ట్‌లను డిలీజ్ చేసింది. 
 
ఇప్పటికే ట్విట్టర్ ఖాతాను ఖాళీ చేసిన దీపిక పదుకునే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను కూడా ఖాళీ చేయడం పట్ల రకరకాలుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్న ఖాతాల నుండి ఒక్కసారిగా ఇలా పోస్ట్‌లు అన్నింటిని తీయడం పట్ల ఉద్దేశ్యం ఏంటీ అనేది తెలియాల్సి ఉంది. అసలు కారణం ఏంటో కూడా చెప్పకుండా ఇలా చేయడం పద్దతి కాదని పలువురు నిరాశ చెందుతున్నారు.