శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డివి
Last Modified: గురువారం, 24 డిశెంబరు 2020 (18:28 IST)

కోటీ మంది ఫాలోవర్స్‌తో కొత్త రికార్డు క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ

సౌత్ ఇండియన్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ మరో మైలు రాయిని చేరుకున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో ఏకంగా కోటీ మంది ఫాలోవర్స్ దక్కింకుకొని రికార్డు సృష్టించాడు. సౌత్ ఇండియన్ స్టార్స్ లలో కోటి మంది ఫాలోవర్స్ ఉన్న నటుడు విజయ్ ఒక్కడే కావడం విశేషం.
 
ఈ అరుదైన రికార్డును ఫ్యాన్స్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ‘‘1 క్రోర్ ఇన్ స్టా రౌడీస్’’ అనే ట్యాగ్‌తో వరల్డ్‌వైడ్‌గా సోషల్ మీడియా అంతా ట్రెండింగ్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండకు యూత్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన డిఫరెంట్ అటిట్యూడ్, స్టైల్‌తో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నాడు.
 
ఇక సోషల్ మీడియాలో కూడా తనదైన స్టైల్లో క్రియేటివ్‌గా పోస్ట్‌లు పెడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అందుకే ఇంతమంది విజయ్‌కు ఫిదా అయ్యారు. తను ఓ ఫోటో పెట్టినా, వీడియో పెట్టినా లైకులు, కామెంట్లతో అభిమానులు ప్రేమ కురిపిస్తారు. విజయ్ కూడా 10 మిలియన్ ఫాలోవర్స్ పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌తో ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్న రౌడీ స్టార్ ఆ తర్వాత శివ నిర్వాణ, సుకుమార్ డైరెక్షన్లలో సినిమాలు చేయనున్నాడు.