మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 డిశెంబరు 2020 (11:06 IST)

నిహారికకు ఇష్టమైన ఫోటో ఇదే.. సోషల్ మీడియాలో వైరల్

Niharika
మెగా డాటర్ వివాహం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఉదయ్ పూర్ ప్యాలెస్ వేదికగా జరిగిన ఈ వివాహం కోసం నాగబాబు రూ. 30 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని టాక్ వస్తోంది. కనులపండువగా జరిగిన మెగా వెడ్డింగ్‌లో చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్‌, పవన్ కళ్యాణ్‌, సాయిధరమ్ తేజ్, కళ్యాణ్ దేవ్, శ్రీజ, సుస్మిత, స్నేహా రెడ్డి తదితరులు సందడి చేశారు. 
 
ప్రస్తుతం నూతన దంపతులు హనీమూన్ కోసం మాల్దీవులకి వెళ్లగా, అక్కడ అందాలని ఎంజాయ్ చేస్తున్నారు. వారం రోజుల పాటు భూతల స్వర్గంలో ఏకాంతంగా గడిపిన తర్వాత తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు. 
 
ఇక డిసెంబర్ 9న జరిగిన నిహారిక పెళ్లికి సంబంధించిన ఫొటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూనే ఉన్నాయి. అయితే పెళ్లి వేడుకలో తనకు ఎంతో ఇష్టమైన ఫొటో ఇదే అంటూ నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో షేర్ చేసింది. ఈ ఫొటో కూడా నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.