1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. What will Surender Reddy's film with Pawan Kalyan be like?

Pawan: పవన్ కళ్యాణ్ తో సురేందర్ రెడ్డి చిత్రం ఎలా వుండబోతోంది !

Surender Reddy, Pawan Kalyan
Surender Reddy, Pawan Kalyan
ఉస్తాద్ గబ్బర్ సింగ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వుండబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా కథ దాదాపు ఖరారు అయినట్లు ఫిలింనగర్ కథనాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు వక్కంతం వంశీ రచయిత. గతంలో కొన్ని హిట్లు, ఫట్స్ ఇచ్చిన ఘనత వుంది ఆయనకు. టెలివిజన్ వ్యాఖ్యాత. రచయితగా ఆయనకు గుర్తింపు వుంది. ఇదే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన కిక్ చిత్రం రవితేజ కు మైలురాయిలా నిలిచింది. 
 
అయితే ఎన్.టి.ఆర్.తో టెంపర్ సినిమా చేశాడు. కళ్యాణ ప్రాప్తిరస్తు, ఏజెంట్ వంటి పలు సినిమాకూ పనిచేశాడు. ఏజెంట్ సినిమా అఖిల్ కు బ్యాడ్  సినిమాగా నిలిచింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో వంశీ సినిమా చేయడం ఫిలింవర్గాల్లో ఆసక్తినెలకొంది. మరి పవన్ అభిమానులకు తగ్గట్లు కథను తయారు చేశాడని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. పవన్ కు మకుటం లాంటి కథగా వంశీ తెలియజేస్తున్నారు.
 
 అయితే గతంలో నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాకు పనిచేశాడు. అది కాపీ కథ అనీ, ఫైండింగ్‌ ఫిష్‌ ఆంగ్ల నవల ఆదారంగా రాశాడని విమర్శలు వచ్చాయి. మరి ఈసారి పవన్ కళ్యాణ్ కథ స్ట్రెయిట్ కథ అయితే పర్వాలేదు. లేదంటే పవన్ కు చెడ్డపేరు వస్తుందేమోనని అభిమానులు సూచిస్తున్నారు. 
తర్వాతి కథనం
Balakrishna: ఢిల్లీ లో నందమూరి బాలకృష్ణకు జీవిత సాఫల్య పురస్కారం