1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : ఆదివారం, 2 జనవరి 2022 (13:48 IST)

పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో 105మినిట్స్

Hansika
రుధ్రాన్ష్ సెల్ లాయిడ్ పతాకం ఫై బొమ్మక్ శివ నిర్మాణంలో  రాజు దుస్సా  దర్శకత్వం వహిస్తున్న" 105 మినిట్స్" చిత్రం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. 
 
ఈ చిత్రంలో కొన్ని కీలక సన్నివేశాల్లో కనిపించబోయే గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా వస్తున్నాయని,చిత్ర యూనిట్ తెలిపింది.ఇండియన్ సినిమా స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్ తో తెరకెక్కుతున్న ఇలాంటి ప్రయోగాత్మక చిత్రానికి సంగీతం అందించడం చాలా సంతోషం గా ఉంది. బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ అందించేందుకు ఛాలెంజ్ గా ఉందని ఈ చిత్ర సంగీత దర్శకులు సామ్ సి.యస్ అభిప్రాయపడ్డారు. హన్సిక నటన అద్భుతంగా అద్భుతంగా ఉందని చిత్ర యూనిట్ మరోసారి కొనియాడారు. 
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ :  కిషోర్ బోయిదాపు, ఆర్ట్ డైరెక్టర్ : బ్రహ్మ కడలి,ఎగ్జ్ క్యూటీవ్ ప్రొడ్యూసర్ : రూప కిరణ్ గంజి, ఎడిటిర్ :శ్యామ్ వడవల్లి, డి ఐ.బి.వి.అర్ శివకుమార్ , గ్రాఫిక్స్ :ఫణివిహార్ గంటల,మేకప్ :బాలు డెక్క, సౌండ్ ఎఫెక్ట్స్ : జాసెన్ జోష్, పి.అర్.ఒ.: జి.ఎస్.కె మీడియా,డిజిటల్  : సుధీర్ తెలప్రోలు, పబ్లిసిటీ  డిసైనర్ : సుధీర్,స్టిల్స్ : గుణ,  ప్రొడక్షన్స్ ఎగ్జి క్యూటీవ్ : అట్లూరి  సురేష్ బాబు.