శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (16:51 IST)

లాభం సెన్సార్ పూర్తి - వినాయ‌క చ‌వితికి విడుద‌ల‌

Labham poster
విజయ్ సేతుపతి శ్రుతిహాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘లాభం’. ఏక కాలంలో రెండు భాషల్లోనూ సినిమా విడుదలవుతుంది. ఇందులో జగపతిబాబు, సాయి ధన్సిక ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్‌.పి.జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని లాయ‌ర్ శ్రీరామ్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ(వైజాగ్ సతీష్) తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. హరీష్ బాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్‌ను పొందింది. వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 9న సినిమాను విడుద‌ల చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘విజయ్ సేతుప‌తి, శ్రుతిహాస‌న్ జంట‌గా న‌టించిన లాభం చిత్రం  వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 9న తెలుగు, త‌మిళ భాష‌ల్లో భారీ ఎత్తున విడుద‌ల‌వుతుంది. సినిమా సెన్సార్ కూడా పూర్త‌య్యింది. క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ వచ్చింది. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు అభినందించారు. దీంతో ఓ మంచి సినిమాను మా బ్యాన‌ర్‌లో ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నందుకు గ‌ర్వంగా అనిపించింది. విజయ్ సేతుపతిగారు డిఫరెంట్ పాత్రలో, లుక్‌లో క‌నిపించ‌బోతున్నారు. అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కులు చూసి ఎంజాయ్ చేసేలా క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో డైరెక్ట‌ర్ ఎస్‌.పి.జ‌న‌నాథ‌న్ సినిమాను రూపొందించారు. ప్ర‌తి పాత్ర ఆక‌ట్టుకుంటుంది. ముఖ్యంగా విజ‌య్ సేతుప‌తి, జ‌గ‌ప‌తిబాబు పాత్ర‌లు  ఢీ అంటే ఢీ అనేలా ప్రేక్ష‌కుల‌ను మెస్మరైజ్ చేస్తాయి. విజయ్ సేతుపతి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది ' అన్నారు.
 
విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్, జగపతిబాబు, సాయి ధన్సిక, కలైయ రసన్, రమేష్ తిలక్, పృత్వి రాజన్, డేనియల్ అన్నే పోపే, నితీష్ వీర, జయ్ వర్మన్ తదితరులు