రైతు సమస్యల నేపథ్యంలో లాభం- ఫస్ట్ లుక్ విడుదల చేసిన బాబి
Labham first look
దర్శకుడు బాబీ మాట్లాడుతూ విజయ్ సేతుపతి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. సైరా, ఉప్పెన చిత్రాలలో ఆయన పాత్రలకు మంచి పేరువచ్చింది. లాభం చిత్రంతోనూ ఆయన తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తారనే నమ్మకం వుంది. ఇందులో అతని పాత్ర తన గత చిత్రాల్లానే చాలా వైవిధ్యంగా వుంటుందని అనుకుంటున్నా. ఫస్ట్ లుక్ చూస్తుంటే, విజయ్ సేతుపతి లుక్ చాలా యూనిక్ గా కనిపిస్తోంది. ఇందులో రైతుల సమస్యలపై పోరాడే యువకుని పాత్రలో విజయ్ సేతుపతి ప్రేక్షకుల్ని అలరిస్తారని నమ్మకం ఉంది. ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాతలకు అభినందనలు. ఈ చిత్రం విజయం సాధించి మంచి లాభాలు తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నా. ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా విడుదలవుతోంది కాబట్టి దేవుడి ఆశీస్సులు కూడా ఈ చిత్రానికి, నిర్మతలకు పుష్కలంగా వుండాలని కోరుకుంటున్నా అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత బత్తుల సత్యనారాయణ(వైజాగ్ సతీష్), సమర్పకుడు లాయర్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
