సంబంధిత వార్తలు
- పవన్ మా మిత్రుడే.. కానీ పొత్తుపై తుది నిర్ణయం కల్యాణ్‌దే: పురంధేశ్వరి
- పొత్తులపై నోటికొచ్చినట్లు వాగకండి: చంద్రబాబు వార్నింగ్.. తలసాని ఎందుకొచ్చారు?
- పవన్ కొత్త చిత్రం పేరు 'అజ్ఞాతవాసి' .. జనవరి 10న రిలీజ్
- సినీ పరిశ్రమ వ్యక్తుల కోసం పనిచేస్తోంది.. టీడీపీ పక్కన పెట్టేసింది: కైకాల సత్యనారాయణ
- మర్యాదగా మాట్లాడండి.. అలా చేస్తే పట్టించుకోను: పీకే ఫ్యాన్స్‌కు చిన్మయి వార్నింగ్
పవన్ కళ్యాణ్‌కు అలా అడుక్కోవడం తెలియదు... అలీ
పవన్ కళ్యాణ్ సినిమాల్లో హాస్య నటుడు అలీకి ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ ఉంటుంది. పవన్ సినిమాల్లో దాదాపుగా సగానికి పైగా అలీ కలిసే నటించారు. పవన్‌కు అత్యంత సన్నిహితులు కూడా. సినిమాల్లోనే కాదు వ్యక్తిగతంగా ఇద్దరూ మంచి స్నేహితులు. అయితే అలీ పవన్ పైన కొన్ని ఆ
పవన్ కళ్యాణ్ సినిమాల్లో హాస్య నటుడు అలీకి ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ ఉంటుంది. పవన్ సినిమాల్లో దాదాపుగా సగానికి పైగా అలీ కలిసే నటించారు. పవన్‌కు అత్యంత సన్నిహితులు కూడా. సినిమాల్లోనే కాదు వ్యక్తిగతంగా ఇద్దరూ మంచి స్నేహితులు. అయితే అలీ పవన్ పైన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
జనసేన పార్టీ పెట్టిన పవన్‌తో మీరు కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ ఒక టీవీ ఛానల్లో అడిగిన ఇంటర్వ్యూలో అలీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. పవన్‌కు కష్టమైనా, సుఖమైనా తానొక్కడే అనుభవించాలన్నది ఆయన ఆలోచన. పార్టీ పెట్టానని చెప్పి అందరినీ రమ్మని అడుక్కోవడం ఆయనకు తెలియదు. వచ్చే వారిని పొమ్మనరు. రాని వారిని రమ్మనరు.. ఇదీ ఆయన నైజం. నన్నింత వరకు జనసేనలోకి రమ్మని అడగలేదు. ఒకవేళ అడిగితే అప్పుడు ఆలోచిస్తానన్నారు అలీ.
