శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2017 (11:06 IST)

పవన్ మా మిత్రుడే.. కానీ పొత్తుపై తుది నిర్ణయం కల్యాణ్‌దే: పురంధేశ్వరి

భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసే అంశంపై పవర్ స్టార్ పవన్ కల్యాణే నిర్ణయం తీసుకోవాలని దగ్గుబాటి పురంధరేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ తమకు మిత్రుడేనని.. పొత్తుకు తామెప్పుడు సిద్ధంగాన

భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసే అంశంపై పవర్ స్టార్ పవన్ కల్యాణే నిర్ణయం తీసుకోవాలని దగ్గుబాటి పురంధరేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ తమకు మిత్రుడేనని.. పొత్తుకు తామెప్పుడు సిద్ధంగానే వుంటామని పురంధేశ్వరి అన్నారు. కానీ తుది నిర్ణయం మాత్రం పవన్ కల్యాణ్‌దేనని ఆమె వ్యాఖ్యానించారు. దక్షిణాదిలో బీజేపీకి ప్రాతినిధ్యం పెరిగిందని పురంధేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. 
 
ఓ ఇంటర్వ్యూలో పురంధేశ్వరి మాట్లాడుతూ.. ఏపీలో బీజేపీ పాగా వేసేందుకు.. పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని విధాలా పనిచేస్తామన్నారు. ఇందులో భాగంగా పవన్‌తో పొత్తుకు కూడా రెడీ అన్నారు. గతంలో పవన్ కల్యాణ్ రెండు పాచిపోయిన లడ్డూలను కేంద్రం ఏపీ ప్రజల చేతుల్లో పెట్టిందని చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ప్రత్యేక హోదా సమసిపోయిన అంశమని, అంతకు మించిన లాభాన్ని రాష్ట్రం ఇప్పుడు ప్యాకేజీ రూపంలో అందుకుంటోందని వెల్లడించారు. 
 
పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టకుండా, కేంద్రానికే అప్పగిస్తే మరింత త్వరగా పనులు పూర్తయ్యుండేవని అభిప్రాయపడ్డ ఆమె, తదుపరి ఎన్నికల్లోగా, పోలవరం స్పిల్ వే, కాపర్ డ్యామ్ తదితరాల నిర్మాణం పూర్తవుతుందని భావించట్లేదన్నారు.