ఆనంద్ దేవరకొండ ‘హైవే’ షూటింగ్ ప్రారంభం.
Anand DEVARAKONDA, Manasa Radhakrishnan
ఇటీవల ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ అంటూ పాపులర్ అయిన మానస రాధాకృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా హైవే చిత్రం నుండి కొత్త పోస్టర్‌ను విడుదలచేసింది చిత్ర యూనిట్. ఆనంద్ దేవరకొండ, మానస రాధాకృష్ణన్ కలిసి ఉన్న ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉండటంతో పాటుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
చిత్ర నిర్మాత వెంకట్ తలారి మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నాం. ఆనంద్ దేవరకొండ, మానస రాధాకృష్ణన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరికొంతమంది ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటించనున్నారు వారి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం. హైవే తప్పకుండా ఒక సక్సెస్‌ఫుల్ థ్రిల్లింగ్ మూవీ అవుతుందని నమ్మకంఉందిఅన్నారు.
చిత్ర దర్శకుడు కేవీ గుహన్ మాట్లాడుతూ,నేను దర్శకత్వం వహిస్తోన్న మూడో చిత్రమిది హైవే నేపథ్యంలో సాగే ఒక సైకో క్రై మ్ థ్రిల్లర్ మూవీ. టెక్నికల్‌గా చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉండబోతుంది. సైమన్ కె. కింగ్ సంగీతం ఈ చిత్రానికి మరో స్పెషల్ అట్రాక్షన్ అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సైమన్ కె. కింగ్
