NBK 111: దాదా- మైసూరులో షూటింగ్ పునః ప్రారంభించిన బాలకృష్ణ
NBK as dada
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన వీరసింహారెడ్డి తర్వాత మరోసారి వస్తున్న సినిమా కావడంతో దాదాపై భారీ అంచనాలు ఉన్నాయి. గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని స్టైలిష్ కమర్షియల్ యాక్షన్ స్పెక్టకిల్‌గా తెరకెక్కిస్తున్నారు. ది కింగ్ ఆఫ్ కెయాస్గా బాలకృష్ణను పరిచయం చేసిన టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో మంచు మనోజ్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పనిచేస్తోంది. అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాశారు. రామ్ లక్ష్మణ్, రవి వర్మ, వెంకట్ యాక్షన్ సీక్వెన్స్‌లను కొరియోగ్రఫీ చేస్తున్నారు.
దాదా డిసెంబర్ 24న థియేటర్లలోకి రానుంది. క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం భారీ స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అలరించేందుకు సిద్ధమవుతోంది.
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, మంచు మనోజ్, కాజల్ అగర్వాల్
