1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. balamevvadu teaser that set huge expectations

భారీ అంచనాలను ఏర్పరిచిన బలమెవ్వడు టీజర్

Balamevvadu Teaser
balamevvadu poster
ఇటీవలే కాలంలో అందరిలో ఎంతో ఆసక్తి ని కలిగిస్తున్న సినిమా బలమెవ్వడు. తాజాగా ఈ సినిమా కి సంబందించిన టీజర్ విడుదల అయ్యింది. ప్రేక్షకులను ఎంతో ఆసక్తి పరుస్తున్న ఈ టీజర్ ఇప్పుడు యూట్యూబ్ లో మంచి స్పందన దక్కించుకుంటుంది. ఈ టీజర్ లో కామెడీ, లవ్ స్టోరీ, మెడికల్ క్రైమ్ ను బాలన్స్ చేస్తూ ఒక పక్కా కమర్షియల్ చిత్రాన్ని తలపించేలా ఉంది.
 
సరికొత్త కథ కథనాలతో ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేసే ఎన్నో అంశాలు ఈ చిత్రంలో ఉన్నట్లు ఈ టీజర్ ను బట్టి తెలుస్తుంది. ధృవన్ కటకం, నియా త్రిపాఠీ హీరో హీరోయిన్ లుగా సత్య రాచకొండ దర్శకత్వంలో సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్ బి మార్కండేయులు నిర్మాతగా చేస్తున్న ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ కి మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు టీజర్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.
 
యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఫృథ్విరాజ్, సుహసిని, నాజర్ వంటి సీనియర్ నటులు ముఖ్య పాత్రల్లో నటించగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూర్చారు. పెద్ద సినిమా లకు సరిసమానంగా మణిశర్మ ఈ సినిమా కి సంగీతం సమకూర్చడం విశేషం.ఈ సినిమా లో లెజెండరీ సంగీత దర్శకుడు కీరవాణి కూడా ఓ పాట ఆలపించడం విశేషం. త్వరలోనే ఈ సినిమా కి సంబందించిన విడుదల తేదీ ని ప్రకటించనున్నారు మేకర్స్.. 
 
సాహిత్యం - కళ్యాణ్ చక్రవర్తి, సినిమాటోగ్రఫీ - సంతోష్ శక్తి, గిరి.పి, ఎడిటర్- జెస్విన్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ధృవన్ కటకం, నిర్మాత - ఆర్ బి మార్కండేయులు, రచన దర్శకత్వం - సత్య రాచకొండ.

 
About Writer
ముర‌ళీకృష్ణ‌