సంబంధిత వార్తలు
- కింగ్ ఆఫ్ కోత అసాధారణ ప్రయాణం: ట్రైలర్ విడుదలలో దుల్కర్ సల్మాన్
- మిస్టర్ ప్రెగ్నెంట్ ట్రైలర్ చూస్తే..సినిమా చూడాలనే ఆసక్తి కలిగింది - నాగార్జున
- బాలి ద్వీపంలో సమంతా రూత్ ఐస్ బాత్
- 'బిగ్ బాస్ రియాలిటీ షో'లో అశ్లీలత : సెన్సార్ ఉండాల్సిందేనంటున్న హైకోర్టు
- బిగ్ బాస్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. కంటిస్టెంట్స్ లిస్ట్ ఇదేనా?
బిగ్ బాస్ సీజన్-7 ఊహలకు అందదు.. సీన్‌లోకి సురేఖా వాణి-సుప్రిత?!
Bigg Boss 7 Season
గత కొన్ని సీజన్లుగా బిగ్ బాస్ రేటింగ్ తగ్గినప్పటికీ, ఈసారి ప్రోమోలు చూస్తే సరికొత్త బిగ్ బాస్ షోను చూడవచ్చునని నమ్మకం కలుగుతుంది. హోస్ట్ నాగార్జున కూడా అదే చెబుతున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్-7 మీ అంచనాలకు అందని విధంగా ఉంటుందని నాగ్ ప్రోమోలో తెలియజేశారు. ఇది అంతం కాదు, ఆరంభం అంటూ చిటికేసి మరీ చెప్పారు.
అంతా ఉల్టా పుల్టా అంటూ ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. ఈ మేరకు స్టార్ మా చానల్ బిగ్ బాస్-7 తాజా ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమోలో చిన్న స్కిట్‌ను కూడా ప్రదర్శించారు.
మరోవైపు మరికొద్ది రోజుల్లో తెలుగు బిగ్ బాస్ 7 షురూ కానున్న నేపథ్యంలో ఈ షోకి సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ ఏడో సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ.. దాదాపుగా ఖరారు అయ్యినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కార్తీక దీపం శోభా శెట్టి, విష్ణు ప్రియ, బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి, నవ్య స్వామి, సురేఖావాణి, ప్రభాకర్ పేర్లు ఇప్పటికైతే బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ సారి బిగ్ బాస్ వేదికపై ఎంటర్టైన్మెంట్ పీక్స్‌లో ఉండేలా సన్నాహాలు చేస్తున్నారట. ఈ షోలో సురేఖా వాణి కూతురు సుప్రితను కూడా రంగంలోకి దించుతున్నారని తెలుస్తోంది.
