శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : శనివారం, 5 ఆగస్టు 2023 (19:33 IST)

మిస్టర్ ప్రెగ్నెంట్ ట్రైలర్ చూస్తే..సినిమా చూడాలనే ఆసక్తి కలిగింది - నాగార్జున

Nagarjuna enters Mr. Pregnant Trailer function
Nagarjuna enters Mr. Pregnant Trailer function
యంగ్ హీరో సోహైల్, రూపా కొడవయూర్ హీరో హీరోయిన్లుగా మైక్ మూవీస్ బ్యానర్ మీద అప్పి రెడ్డి, రవి రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'మిస్టర్ ప్రెగ్నెంట్'. ఈ సినిమాను దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందిస్తున్నారు. ఈ నెల 18న 'మిస్టర్ ప్రెగ్నెంట్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను కింగ్ నాగార్జున విడుదల చేశారు. 
 
Nagarjuna, Sohail, Rupa Kodavayur, Appi Reddy and others
Nagarjuna, Sohail, Rupa Kodavayur, Appi Reddy and others
ఈ సందర్భంగా నాగార్జున  మాట్లాడుతూ - బిగ్ బాస్ లో కప్పు గెలవకుండానే విన్నర్ అయ్యాడు సోహైల్. చాలా తెలివైన వాడు. ప్రతి గేమ్, ప్రతి టాస్క్ కష్టపడి ఆడేవాడు. గెలవాలనే తపన అతనిలో కనిపించేది. అలాంటి పట్టుదలతోనే ఈ సినిమా చేశాడు. మిస్టర్ ప్రెగ్నెంట్ అనగానే మగవాళ్లు ప్రెగ్నెంట్ ఎలా అవుతారు, అది సినిమాలో ఎలా చూపించారు అనే ఆసక్తి కలిగింది. ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ చూశాక సినిమా చూడాలనే ఆసక్తి ఏర్పడింది. ట్రైలర్ ఎమోషనల్ గా ఉంది. దర్శకుడు శ్రీనివాస్ కు ఇది ఫస్ట్ మూవీ. ఆయనే స్క్రిప్ట్ రాశాడు. డిఫికల్ట్ సబ్జెక్ట్ ఇది. బాగా తెరకెక్కించాడని అర్థమవుతోంది. ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అప్పిరెడ్డి గారు, వాళ్ల బ్రదర్, ఫ్రెండ్స్ అందరూ నా గురించి మాట్లాడిన మాటలకు థాంక్స్. మైక్ మూవీస్ లో నాలుగో సినిమా ఇది. సక్సెస్ అవ్వాలని హార్ట్ ఫుల్ గా కోరుకుంటున్నా. డెలివరీ అంటే ఒక ప్రాణం పోయడం. అఖిల్ డెలివరీ టైమ్ లో ఆరు నెలలు ఏ షూటింగ్స్ పెట్టుకోకుండా అమలతోనే ఉన్నాను. ఆ టైమ్ నా లైఫ్ లో బెస్ట్ మూవ్ మెంట్. అన్నారు.
 
హీరో సోహైల్ మాట్లాడుతూ - తెలుగు ప్రేక్షకుల్లో నాకు దక్కిన గుర్తింపునకు నాగార్జున గారే కారణం. ఆయన బిగ్ బాస్ లో మమ్మల్ని ఎంతో ఎంకరేజ్  చేశారు. సొంత వాళ్లలా చూసుకున్నారు. నాకు డల్ గా అనిపిస్తే నాగార్జున గారే ధైర్యం చెబుతారు. ఈ సినిమా గ్లింప్స్ ఆయనకు చూపించి, ట్రైలర్ రిలీజ్ కు రావాలని కోరాను. ఆయన తప్పకుండా వస్తా అన్నారు. గుర్తు పెట్టుకుని మరీ ఇవాళ వచ్చారు. నాగ్ సార్ కు ఎంత థాంక్స్ చెప్పినా తక్కువే. తొమ్మిది నెలలు బిడ్డను మోసి కనేందుకు తల్లి ఎంత కష్ట పడుతుందో మనం వింటుంటాం. కానీ ఆ కష్టాన్ని ఒక అబ్బాయిగా నా పాత్ర ద్వారా చూపించబోతున్నాను. చాలా మంచి మూవీ. ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ రెండూ ఉంటాయి.  ఈ సినిమా చూశాక ఇంటికి వెళ్లి అమ్మను హగ్ చేసుకుంటారు. ఫ్యామిలీతో కలిసి మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా చూడండి. అన్నారు.
 
నిర్మాత రవిరెడ్డి సజ్జల మాట్లాడుతూ - మా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన కింగ్ నాగార్జున గారికి థాంక్స్ చెబుతున్నాం. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డైరెక్టర్ ఆర్జీవీ మొదలు..ఇప్పటిదాకా ఎంతోమంది న్యూ టాలెంట్ ను పరిచయం చేసిన ఘనత నాగార్జున గారికే దక్కుతుంది. ఆ మంచితనమే ఆయన ఛార్మింగ్ లుక్స్ కు కారణంగా భావిస్తుంటాను. మా సినిమాకు పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ అందరికీ థాంక్స్ చెబుతున్నా. అన్నారు.
 
నిర్మాత వెంకట్ అన్నపరెడ్డి మాట్లాడుతూ - మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి నాగార్జున గారు రావడం సంతోషంగా ఉంది. మా ఇంట్లో  అందరం ఆయన అభిమానులమే. నేను మా సినిమా ప్రమోషన్ ఈవెంట్స్ కోసం యూఎస్ నుంచి వచ్చాను. ఈ కొద్ది సమయం నాగార్జున గారితో గడిపే అవకాశం రావడం ఆనందంగా ఉంది. మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా కొత్తగా ఉంటుంది, యూనిక్ కాన్సెప్ట్ తో చేశాం. మీ అందరూ చూస్తారని ఆశిస్తున్నా. అన్నారు.
 
నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ - మిస్టర్ ప్రెగ్నెంట్ నా మనసుకు దగ్గరైన సినిమా. యూఎస్ లో నా భార్య ప్రెగ్నెంట్ అయినప్పుడు 9 నెలలు ఆమె పడే కష్టాన్ని చూశాను. ఇక్కడిలా సొంతవాళ్ల ఇంటికి పంపించే అవకాశం యూఎస్ లో కలగలేదు. బిడ్డను కనేందుకు నా భార్య పడే కష్టాన్ని చూశాను. అప్పుడే అనిపించింది ప్రెగ్నెన్సీ బాధను తట్టుకునే శక్తి మహిళలకే ఉంది. ఆ మహిళలందరికీ నమస్కారం చెబుతున్నా. ఈ కథ విన్నప్పుడు నన్నెంతో ఇన్స్ పైర్ చేసింది. మేల్ ప్రెగ్నెంట్ అనేది కొత్త అంశం. ఈ సినిమా మహిళల గొప్పదనం చెప్పేందుకు చేసిన సినిమా. మహిళా ప్రేక్షకులంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా. నాగార్జున గారు మాకెప్పుడూ స్ఫూర్తినిస్తారు. ఆయన హలో బ్రదర్ సినిమా నాకు ఎప్పటికీ ఫేవరేట్ మూవీ. ఇప్పటికీ డిస్ట్రబ్ గా ఉంటే కాసేపు రిలాక్స్ కోసం హలో బ్రదర్ పాటలు వింటాను. మా సినిమాను ఎంకరేజ్ చేసేందుకు వచ్చిన నాగార్జున గారికి థాంక్స్ చెబుతున్నాం. అన్నారు.
 
నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ - కొత్తవాళ్లను ఎంకరేజ్ చేసే నాగార్జున గారికి ఈ సినిమా తరుపున థాంక్స్ చెబుతున్నా. మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ స్క్రిప్ట్ దశనుంచి వీళ్లతో ట్రావెల్ అవుతున్నా. మైక్ మూవీస్ తమ ప్రతి సినిమాను కొత్త కథలతో నిర్మిస్తోంది. కొత్తగా  చేసే ప్రయత్నాలను మన ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ సినిమాకు కూడా విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి మాట్లాడుతూ - నాగార్జున గారి సినిమాలను చూస్తూ పెరిగాము. ఇవాళ ఆయన పక్కన కూర్చుని నా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసుకోవడం గర్వంగా ఉంది. మిస్టర్ ప్రెగ్నెంట్ కథ చెప్పినప్పుడు చాలా మంది ప్రొడ్యూసర్స్ ఈ కథను యాక్సెప్ట్ చేసేందుకు భయపడ్డారు. ఇది ప్రయోగాత్మక సినిమా మేము చేయలేం అని సందేహించారు. కానీ అప్పిరెడ్డి గారు, రవిరెడ్డి గారు, వెంకట్ గారు ఈ కథను నమ్మి..చేస్తే ఇలాంటి డిఫరెంట్ మూవీనే చేయాలని నిర్ణయించుకున్నారు. వాళ్లకు థాంక్స్ చెబుతున్నా. అమ్మ గురించి చెప్పాలంటే అమ్మ అని రెండక్షరాలు రాస్తే  చాలు. డెలివరీ కోసం అమ్మ పడే కష్టాన్ని తీసుకున్న ఓ నాన్న కథ ఇది.  సినిమా కొత్తగా ఉంటూ ఆకట్టుకుంటుంది. ట్రైలర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నా. అన్నారు.
 
హీరోయిన్ రూపా కొడవయూర్ మాట్లాడుతూ - కొత్త తరహా సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఒక ఫీస్ట్ లాంటి సినిమా ఇది. ఈ ప్రాజెక్ట్ కోసం నన్ను అప్రోచ్ అయినప్పుడు ఇలాంటి సినిమా చేయడం సాధ్యమేనా అనిపించింది. కానీ బ్యూటిఫుల్ గా మూవీని తెరకెక్కించారు. అప్పిరెడ్డి గారు ఎప్పుడూ తెలుగు హీరోయిన్స్ కు అవకాశాలు ఇస్తుంటారు. మైక్ మూవీస్ నాకొక ఫ్యామిలీలా అనిపిస్తుంటుంది. మంచి ఎక్సీపిరియన్స్ ఇచ్చే మూవీ ఇది. తప్పకుండా చూడండి. అని చెప్పింది.