1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 1 ఆగస్టు 2023 (13:04 IST)

హీరో అశ్విన్ బాబు తాగాజా సినిమా టైటిల్ వచ్చినవాడు గౌతం

vachinavaadu Gautham poster
vachinavaadu Gautham poster
యూనిక్  థ్రిల్లర్ ‘హిడింబ’లో తన అద్భుతమైన యాక్షన్-ప్యాక్డ్ నటనతో అందరినీ సర్ ప్రైజ్ చేసిన  ట్యాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు ఇప్పుడు మరో ఎక్సయిటింగ్ చిత్రానికి సిద్ధమవుతున్నారు. అశ్విన్ బాబు 8వ చిత్రం #AB8 మామిడాల ఎం ఆర్ కృష్ణ  దర్సకత్వంలో ఈరోజు అనౌన్స్ చేశారు.  షణ్ముఖ పిక్చర్స్‌పై ఆలూరి సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆలూరి హర్షవర్ధన్ చౌదరి సమర్పిస్తున్నారు.
 
అశ్విన్ బాబు పుట్టినరోజు సందర్భంగా  ఈ చిత్రానికి ‘వచ్చినవాడు గౌతం’ అనే టైటిల్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. మెడికో థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఆసక్తికరమైన టైటిల్ పోస్టర్ స్టెతస్కోప్ పట్టుకున్న హీరో చేతిని చూపిస్తుంది. అతని ముఖాన్నిచేయి కవర్ చేస్తోంది. చేతి నుండి రక్తం కారుతోంది.
 
కథనంలో ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండే సినిమా కోసం అశ్విన్ బాబు ఫిజికల్ గా మేకోవర్ అయ్యారు. గౌర హరి సంగీతం అందిస్తుండగా, శ్యామ్ కె నాయుడు కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్. రామ్‌-లక్ష్మణ్‌ మాస్టర్స్  యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తుండగా , అబ్బూరి రవి డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర వివరాలు త్వరలో  తెలియజేస్తారు.