సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 20 జులై 2023 (15:41 IST)

ఆటవిక జాతి నగరానికే వస్తే ఏమవుతుంది ! హిడింబ రివ్యూ

aswin-hidimba
aswin-hidimba
నటీనటులు : అశ్విన్ బాబు, నందితా శ్వేత, మకరంద్ దేశ్‌పాండే, రఘు కుంచె, శ్రీనివాసరెడ్డి, సంజయ్ స్వరూప్, రాజీవ్ కనకాల, షిజ్జు, రాజీవ్ పిళ్ళై, శుభలేఖ సుధాకర్ తదితరులు
సాంకేతికత : మాటలు : కళ్యాణ్ చక్రవర్తి, ఛాయాగ్రహణం : బి. రాజశేఖర్, సంగీతం : వికాస్ బాడిస, సమర్పణ : అనిల్ సుంకర, నిర్మాత : గంగపట్నం శ్రీధర్, దర్శకత్వం : అనిల్ కన్నెగంటి.  విడుదల తేదీ: జూలై 20, 2023
 
'రాజు గారి గది'  సినిమాలతో విజయాలు అందుకున్న కథానాయకుడు అశ్విన్ బాబు. యాంకర్ ఓంకార్ సోదరుడు. భిన్నమైన కథలు ఎంచుకోవాలని అన్న నుంచి సూచనలు తీసికుని చేసిన సినిమా హిడింబ'. హిడింబ అనేది రాక్షస జాతి. పురాణాల్లో ఉంది. దాన్ని అవుట్ లైన్ గా తీసుకుని ఇప్పటికి అనుగుణంగా కథ రాసినట్లు దర్శకత్వం వహించిన అనిల్ కన్నెగంటి.తెలిపారు. మరి ఈరోజే విడుదలైన సినిమా ఎలావుందో చూద్దాం.
 
కథ:
హైదరాబాద్ సిటీలో వరుసగా అమ్మాయిలు అదృశ్యం అవుతుంటారు. ఆఫీసర్ అభయ్ (అశ్విన్ బాబు)  ఇన్వెస్టిగేషన్ చేసినా కొలిక్కి రాదు. తోటి  ఆఫీసర్ రఘుకుంచె అభయ్ కు బ్రేక్ లా అడ్డుపడుతుంటాడు. ఆ సమయంలో ఇన్వెస్టిగేషన్ కోసం ఐపీఎస్ ఆద్య (నందితా శ్వేతా)ను కేరళ నుంచి రప్పిస్తారు. ఆద్యకు సహకారిగా అభయ్ ఉంటాడు. ఓ క్లూ ఆధారంగా అమ్మాయిలను కిడ్నాప్ చేసిన ఓ ముఠా నాయకుడిని చితకొట్టి హాస్పిటల్ లో జాయిన్ చేస్తాడు అభయ్. అయినా అమ్మాయిల కిడ్నాప్ ఆగదు. అయితే ఈ మిస్సింగ్ కేసులు కేరళలో గతంలో జరిగిన కేసుల తరహాలోనే జరగడంతో ఆధ్య కేరళ వెళుతుంది. అక్కడ కొన్ని గగుర్పాటు కలిగించే విషయాలు బయటపడతాయి. అవి ఏమిటి. అసలు అమ్మాయిలను కిడ్నాప్ కు కారకుడు ఎవరు అనేది సస్పెన్స్..  
 
విశ్లేషణ :
 
ఈ కథకు రాక్షసుడు అనే పేరు మొదట పెట్టాలని అనుకున్నారు. కానీ అప్పటికే ఈ ఆపేరుతో సినిమాలు రావడంతో హిడింబ అనే పేరు పెట్టారు. ఇప్పటికి హిడింబి అనేపేరుతో హిమాలయాలు, నేపాల్ కు చెందిన అటవీ ప్రాంతంలో ఓ తెగ ఉంది. వారికి హిడింబి అనే దేవతను ఆరాధిస్తారు. అయితే వారికి దీనికి సంబంధం లేదుకానీ. పేరువల్ల క్రేజ్ వచ్చింది. 
 
ఈ కథలో ప్రధానమైన అంశం మనుషులను మేకలు, కోళ్లు గా నరికి తినే జాతి హిడింబ జాతి.. ఈ తరహా సినిమాలు హాలీవుడ్ లో వచ్చాయి. ఈ పాయింట్ కూడా అక్కడనుచే స్ఫూర్తిగా తీసుకున్నట్లు హీరో ఇంట్రడక్షన్ సీన్ లో తెలిసిపోతుంది. అశ్విన్ వ్యాయామం చేస్తూ ఈ తరహా మూవీ చూస్తుంటాడు. ఆతర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తూ అనుమానం వచ్చిన అందరినీ ఫైట్ చేస్తాడు. మధ్యలో  ఆద్యతో రొమాన్స్. ఇద్దరకూ ఒకప్పుడు పోలీస్ ట్రయినింగ్ లో ప్రేమికులు. ఓ చిన్న విషయంలో విడిపోతారు. మల్లి  ఇలా కలుస్తారు. 
 
హిడింబ'లో కథ, కథాంశం కొత్తగా ఉన్నాయి. కానీ దాన్ని ఆకట్టుకొనేలా దర్శకుడు చెప్పలేకపోయాడు. ముగింపు ట్విస్ట్ షాక్ కు గురిచేస్తుంది. అందుకు ఒప్పుకున్న హీరోని హ్యాట్సాఫ్ చెప్పాలి. అసలు ఇలా చేయవచ్చు అనేదే కేవలం హాలీవుడ్ మూవీస్లో కనపడతాయి. తెలుగులో కొంచెం ఓన్ చేసుకోవడం కష్టం. అదే ఒకరకంగా మైనస్ అని కూడా చెప్పవచ్చు. 
 
 ఫస్టాఫ్ అంతా నార్మల్ ఇన్వెస్టిగేషన్ తరహాలో సి.ఐ.డి.  సీరియల్ లాగా ఉంటుంది. సి.ఎం., డిజిపి. చేసే పనులు సిల్లీగా అనిపిస్తాయి. ద్వితీయార్థంలో కేరళ వెళ్ళాక కథలో రన్ కనిపిస్తుంది. స్క్రీన్ మీద గ్రాండియర్ ఆకట్టుకుంటుంది. ముగింపు కొత్తగా చెప్పాలని బలవంతంగా హీరోపై రుద్దినట్లు ఉంది. 
 
 థ్రిల్లింగ్ సీన్లను బాగా రాశారు. 'హిడింబ' రొటీన్ గా తీయకుండా కొత్తగా తీసి ప్రయత్నంలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ కనిపిస్తుంది. దాంతో ప్రేక్షకుడు కనెక్ట్ కాలేదు. ఆ  లాజిక్కు ఎందుకు మిస్సాయాడో అర్థంకాదు. మధ్యలో మెడికల్ మాఫియా కథ కూడా ఉంటుంది. స్టార్టింగులో ఆర్గాన్ ట్రేడింగ్ అంటారు. తర్వాత ఆ ఊసు ఉండదు. దాన్ని గాలికి వదిలేశారు. స్క్రీన్ ప్లే, రైటింగ్ పరంగా దర్శకుడు చాలా స్వేచ్ఛ తీసుకుని సినిమా చేశారు. దాంతో గందరగోలొంగా మారింది. 
 
అశ్విన్ బాబు నటన, యాక్షన్ సీక్వెన్సుల్లో మెప్పిస్తారు. కాలాబండా ఫైట్ గానీ, కేరళలో తీసిన ఫైట్ గానీ బాగున్నాయి.  ఐపీఎస్ ఆద్య పాత్రలో నందితా శ్వేతా పర్వాలేదు. మకరంద్ దేశ్‌పాండే హిడింబ జాతీయుడిగా సరిపోయాడు.  రఘు కుంచె, సంజయ్ స్వరూప్, షిజ్జు, శ్రీనివాసరెడ్డి, రాజీవ్ పిళ్ళై తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.
 
సీరియస్ మూవీ.  పాటలు లేవు. రొమాన్స్ ఒక్కటే ఉంది. నేపథ్య సంగీతం బాగుంది. ఇప్పటి వరకు తెలుగు తెరపై రానటువంటి కథను చెప్పే ప్రయత్నం చేశారు. హాలీవుడ్ మూవీస్ బాగా ఇష్టపడే వారికి ఇది నచుతుంది.
రేటింగ్ : 2.5/5