ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 17 జులై 2023 (18:54 IST)

హిడింబ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది : దర్శకుడు అనీల్ కన్నెగంటి

Anil Kanneganti, Ashwin Babu, Nandita Shweta, Producer Sridhar
Anil Kanneganti, Ashwin Babu, Nandita Shweta, Producer Sridhar
హీరో అశ్విన్ బాబు హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ హిడింబ థియేట్రికల్ రిలీజ్ కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అనీల్ కన్నెగంటి దర్శకత్వంలో అనిల్ సుంకర సమర్పణలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్), ఓఎకె  ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై గంగపట్నం శ్రీధర్ నిర్మించిన హిడింబ ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
హిడింబ థియేట్రికల్ ట్రైలర్ ఇంట్రస్టింగ్ సెటప్, గ్రాండ్ మేకింగ్, అత్యున్నత సాంకేతికత ప్రమాణాతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ రోజు మేకర్స్ రివర్స్ ట్రైలర్‌ విడుదల చేశారు. ప్రతి సీక్వెన్స్‌ను రివర్స్ ఆర్డర్‌లో ప్రజంట్ చేసిన ఈ ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ గా వుంది. టాలీవుడ్‌లో రివర్స్ ట్రైలర్ విడుదల చేయడం ఇదే తొలిసారి.
 
రెండు వేర్వేరు టైమ్ లైన్స్ లో కథ అద్భుతంగా చూపించారు. యూనిక్ థాట్ తో సరికొత్తగా ట్రైలర్ ని ప్రజంట్ చేసిన చిత్ర యూనిట్ ని అభినందించాలి. యాక్షన్,  థ్రిల్లింగ్ అంశాలతో పాటు, ట్రైలర్ సినిమాలోని రొమాంటిక్, ఇతర అంశాలను కూడా చూపించింది. ఎడిటర్ ఎమ్ ఆర్ వర్మ ట్రైలర్‌ను చాలా అద్భుతంగా కట్ చేశారు. వికాస్ బాదిసా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బ్రిలియంట్ గా ఉంది.బి రాజశేఖర్ సినిమాటోగ్రఫీని అందిస్తున్న ఈ చిత్రం విజువల్స్ అబ్బురపరుస్తున్నాయి. మరో 3 రోజుల్లో రాబోతున్న హిడింబ పై రివర్స్ ట్రైలర్ మరింతగా అంచనాలని పెంచింది.
 
రివర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ.. కథని బలంగా నమ్మి చేసిన చిత్రమిది.  హిడింబ స్క్రీన్ ప్లే, విజువల్స్ రెగ్యులర్ గా కాకుండా కొత్తగా వుంటాయి. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది.  జాలై 20న విడుదలౌతుంది. అందరూ చూడండి. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. మీ అందరి సపోర్ట్ కావాలి'' అన్నారు.
 
హీరోయిన్ నందితా శ్వేతా మాట్లాడుతూ.. హిడింబ రిలీజ్ కోసం చాలా ఎక్సయిటింగా ఎదురుచూస్తున్నాం. బేసిగ్గా సినిమా గురించి మేము మాట్లాడటం కామన్. కానీ ఈ సినిమా ట్రైలర్ టీజర్ చూసిన ప్రేక్షకులు గొప్పగా మాట్లాడుతున్నారు. ఇది మా విజయంగా భావిస్తున్నాం. జూలై 20 తర్వాత కూడా ఇదే విజయానందంతో కలుస్తాం'' అన్నారు.
 
దర్శకుడు అనీల్ కన్నెగంటి మాట్లాడుతూ.. థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలంటే జనం ఏం కోరుకుంటున్నారని అంశంపై కొంచెం రిసెర్చ్ తర్వాత రాసుకున్న కథ హిడింబ. థియేటర్ లో చూస్తేనే కిక్ వుంటుంది. ‘హిడింబ ‘తో కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. ఒక చరిత్ర వెదుక్కుంటూ వెనక్కివెళ్ళే ఇన్వెస్ట్ గేషన్ థ్రిల్లర్ ఇది. దీనికి సింబాలిక్ గా ఉటుందని రివర్స్ ట్రైలర్ ని కట్ చేశాం. అశ్విన్ లేకపోతె ఈ సినిమా ఇంతదూరం వచ్చేది కాదు. చాలా హార్డ్ వర్క్ చేశారు. నిర్మాత శ్రీధర్ గా ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. నాకు గొప్ప తృప్తిని ఇచ్చిన సినిమా ఇది. హిడింబ డిఫరెంట్ మూవీ. ప్రేక్షకులకు తప్పకుండా గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఈ చిత్రానికి పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. జూలై 20 సినిమా విడుదలౌతుంది. ప్రేక్షకులు థియేటర్ లో చూసి మా టీంని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను.
 
నిర్మాత శ్రీధర్ మాట్లాడుతూ.. హిడింబ ట్రైలర్ టీజర్ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరో అశ్విన్ , నందిత శ్వేతా, దర్శకుడు అనిల్, టీం అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. జూలై 20న సినిమా విడుదలౌతుంది. అందరూ థియేటర్ లో చూసి మమ్మల్ని సపోర్ట్ చేయాలి’ అని కోరారు. ఈ ఈవెంట్ లో శ్రీనివాస్ రెడ్డి, రఘు కుంచె మిగతా చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.