1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 ఆగస్టు 2023 (15:18 IST)

పాకిస్థాన్ మాజీ ప్రధానికి మూడేళ్ల పాటు జైలు శిక్ష

imran khan
తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధినేత, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష పడింది. పాక్ కోర్టు కూడా ఐదు సంవత్సరాల పాటు అనర్హత వేటు, లక్ష రూపాయల జరిమానా విధించింది. దీంతో ఆయన ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. 
 
పాక్ ప్రధాని హయాంలో వచ్చిన బహుమతులను ఖజానాకు చేర్చకుండా విక్రయించిన కేసులో శనివారం కోర్టు తీర్పు వెలువరించడం గమనార్హం. 
 
ఇమ్రాన్ ఖాన్ నిజాయితీ లేని వ్యక్తి అని రుజువైనందున ఇస్లామాబాద్ పోలీసులు ఇమ్రాన్ ఖాన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది.