గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 జులై 2023 (14:45 IST)

మోదీ సార్.. మణిపూర్ గురించి మాట్లాడండి.. సోనియా గాంధీ

sonia
మణిపూర్‌ పరిస్థితిపై సభలో చర్చించాలని కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రధాని నరేంద్ర మోదీని కోరినట్లు లోక్‌సభలో ఆ పార్టీ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి తెలిపారు. వర్షాకాల సమావేశాల తొలిరోజు లోక్‌సభలో ప్రధానితో సంక్షిప్త సంభాషణ సందర్భంగా సోనియా గాంధీ ఈ డిమాండ్ చేశారు.
 
ఈ రోజు సభ సమావేశానికి ముందు, ప్రధాని మోదీ వివిధ నేతలను పలకరించారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు నేతలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకోవడం ఆనవాయితీ. మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన 140 కోట్ల మంది భారతీయులను సిగ్గుతో తలదించుకునేలా చేసిందని, చట్టం తన పూర్తి శక్తితో పనిచేస్తుందని ప్రధాని పేర్కొన్నారు. 
 
దోషులను విడిచిపెట్టబోమని దేశ ప్రజలకు తాను హామీ ఇస్తున్నానని ప్రధాని తెలిపారు. ఇకపోతే సేనాపతి జిల్లాలోని ఒక గ్రామంలో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి, వేధింపులకు గురిచేస్తున్న వీడియోలో కనిపించిన ప్రధాన నిందితుల్లో ఒకరిని మణిపూర్ పోలీసులు గురువారం అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.