యూఏఈలో అడుగుపెట్టిన ప్రధాని మోదీ.. కీలకాంశాలపై చర్చ
భారత ప్రధాని మోదీ యూఏఈలో అడుగుపెట్టారు. రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటనను ముగించుకున్న మోదీ శనివారం అబుదాబి చేరుకున్నారు. అబుదాబి విమానాశ్రయంలో ఆయనకు యూఏఈ అధ్యక్షుడు, అబుదాబి రాజు షేక్ మొహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ ఘన స్వాగతం పలికారు.
అనంతరం జరిగిన వీరిద్దరి సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఎనర్జీ, ఫుడ్ సెక్యూరిటీ, ఢిఫెన్స్ రంగాలపై ప్రధానంగా చర్చ జరగనుంది.
ఇకపోతే.. గత 9 ఏళ్లలో ప్రధాని మోదీ యూఏఈలో పర్యటించడం ఇది ఐదవసారి. కరోనా సమయంలో కూడా రెండు దేశాలు ఒకదానికొకటి కనెక్ట్ అయ్యాయి. ఒక సంవత్సరంలోనే భారత్, యుఎఇ మధ్య వాణిజ్యంలో 19 శాతం వృద్ధి నమోదైంది.