1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 జులై 2023 (11:01 IST)

బ్రిటన్ వెళ్ళాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్...

VISA applications
భారతీయ సంతతికి చెందిన బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్ భారతీయ యువతకు బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఇకపై యూకే వెళ్ళాలని భావించే వారి నుంచి వీసా ఖర్చులు భారీగా వసూలు చేయనున్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించడం గమనార్హం.
 
వైద్య ఖర్చుల కోసం వీసాదారులు చెల్లించే హెల్త్ సర్ చార్జ్ ఇతర ఫీజులు పెరుగుతాయని ఆయన గురువారం స్పష్టం చేశారు. దేశంలో ప్రభుత్వ వైద్య సిబ్బంది జీతాలు పెంచనున్న నేపథ్యంలో వీసాకు సంబంధించిన వైద్య ఖర్చులు కూడా పెరుగుతాయని అన్నారు.
 
టీచర్లు, పోలీసులు, జూనియర్ డాక్టర్లతో పాటు ఇతర ప్రభుత్వ సిబ్బంది వేతనాలు పెంచాలంటూ ఇటీవల బ్రిటన్‌లోని ఓ స్వతంత్ర కమిటీ సూచించింది. ఈ ప్రతిపాదనలకు ఆమోదించాలని బ్రిటన్ ప్రధానిపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
ప్రభుత్వ సిబ్బంది సగటు వేతనాలు 5 నుంచి 7 శాతం మేర పెరుగుతుందని చెప్పుకొచ్చారు. అయితే, ఈ ఖర్చులకు అప్పుల చేసి నిధులు సమీకరించబోమని ఆయన స్పష్టంచేశారు. భవిష్యత్తులో ద్రవ్యోల్బణం పరిగే అవకాశం ఉన్నందున ఇలాంటి చర్యకు పూనుకోమని స్పష్టం చేశారు.