ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

ఫ్రాన్స్‌కు బయలుదేరి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ... కీలక ఒప్పందాలపై సంతకాలు

narendra modi
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మారు విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. శుక్రవారం జరుగనున్న ఫ్రాన్స్ దేశ నేషల్ డే వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన వెళ్ళారు. ఈ సందర్భంగా స్పేస్, రక్షణ రంగాలకు సంబంధించిన పలు కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు. 
 
ఫ్రాన్స్ జాతీయ దినోత్సవమైన బాస్టిల్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా ఆ దేశ ప్రభుత్వం ఆహ్వానించిన విషయం తెల్సిందే. నిజానికి బాస్టిల్ డే వేడుకలకు విదేశీ నేతలకు ఫ్రాన్స్ సాధారణంగా ఆహ్వానం అందించదు. అయితే, భారత ప్రధాని హోదాలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ వేడుకలు హాజరుకావడం ఇదే రెండోసారి కావడం గమనార్హం. 
 
ఈ వేడుకల్లో భాగంగా, శుక్రవారం జరిగే నేషనల్ డే లో యూరప్‌లోనే అతిపెద్ద సైనిక కవాతుగా పేరుగాంచిన ఈ పరేడ్‌లో మోడో గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ పరేడ్‌లో భారత సైనిక బృందాలు కూడా పాల్గొంటుండటం గమనార్హం. ప్రధాని మోడీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు అధికారి విందుతో పాటు ప్రైవేటు విందు కూడా ఇవ్వనున్నారు. రెండు రోజుల పాటు సాగే ప్రధాని మోడీ  పర్యటనలో మెక్రాన్, మోడీ పలు అంశాలపై చర్చలను జరపడమే కాకుండా కీలక ఒప్పందాలను కూడా చేసుకోనున్నారు. 
 
ముఖ్యంగా, డిఫెన్స్, స్పేస్, సివిల్ న్యూక్లియర్, బ్లూ ఎకానమీ, ట్రేడ్, పెట్టుబడులు, విద్యా రంగాలలో పాటు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు ఇరు దేశాల అధినేతలు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వబోతున్నారు. తన పర్యటనలో భాగంగా మోడీ ఆ దేశ ప్రధానమంత్రితో పాటు సెనేట్, నేషనల్ అసెంబ్లీ అధ్యక్షులతో కూడా సమావేశం కానుంది.