ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

హస్తిన బాట పట్టిన ఏపీ సీఎం జగన్.. ప్రధాని - హోం మంత్రి దర్శనం కోసం..

jagan
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం మరోమారు హస్తినకు బయలుదేరి వెళ్లారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆయన గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జగన్.. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అక్కడకు చేరుకున్న తర్వాత కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించనున్నారు. 
 
ఇందులోభాగంగా, మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. ఆ తర్వాత సాయంత్రం 4.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా తన కేసులతో పాటు ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించనున్నారు. సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్‌తో భేటీ అవుతారు. అలాగే, మరికొందరు కేంద్ర మంత్రులతో కూడా ఆయన సమావేశమవుతారు.