గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 జులై 2023 (11:17 IST)

విజయవాడ నుంచి చెన్నైకి కొత్త వందే భారత్ రైలు

vande bharat
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నుంచి చెన్నైకి కొత్త వందే భారత్ రైలు నడుస్తోంది. ఈ రైలును ప్రధాని మోదీ 7వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. 
 
విజయవాడ నుండి గూడూరు, రేణిగుంట, చెన్నై మీదుగా చెన్నై చేరుకునే 8వ వందే భారత్ రైలు నుండి ప్రయాణీకులు రైల్వే టిక్కెట్లను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. 
 
అదే మార్గంలో చెన్నై నుంచి విజయవాడకు వందే భారత్ రైలు నడపనున్నారు. వందే భారత్ రైలు విజయవాడ నుండి బయలుదేరి సుమారు 6 గంటల 30 నిమిషాలలో చెన్నై చేరుకుంటుంది.