సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 1 జులై 2023 (21:22 IST)

సోషల్ సెక్యూరిటీ స్కీం శాచురేషన్ క్యాంపెయిన్ నిర్వహించిన ఇండియన్ బ్యాంక్

image
భారత ప్రభుత్వ సోషల్ సెక్యూరిటీ స్కీం శాచురేషన్ కార్యక్రమం క్రింద వణుకూరు గ్రామంలో PMJJBY, PMSBY కోసం ఇండియన్ బ్యాంక్ గ్రామ పంచాయతీ స్థాయి శాచురేషన్ క్యాంపెయిన్ నిర్వహించింది. ఇందులో 7000 కంటే ఎక్కువ మంది నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో   PMJJBY హక్కుదారులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు చెక్కులను కూడా అందజేశారు.
 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల కోసం విజయవాడలో మెగా SHG ఔట్ రీచ్ క్యాంపును సైతం బ్యాంక్ నిర్వహించింది, ఇందులో 3844 స్వయం సహాయక బృందాలు రూ. 500 కోట్లు ఆర్ధిక సహకారాన్ని అందుకున్నాయి. అదనంగా RAM (రిటైల్, అగ్రి మరియు MSME) విభాగంలో రుణగ్రహీతలకు రూ. 350 కోట్లు ఋణాలు మంజూరు చేయబడ్డాయి.
 
ఈ రెండు కార్యక్రమాలకు ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, శ్రీ మహేష్ కుమార్ బజాజ్ అధ్యక్షత వహించగా ఫీల్డ్ జనరల్ మేనేజర్, హైదరాబాద్, శ్రీ. గణేశరామన్ ఎ, జనరల్ మేనేజర్ (RBD), కార్పొరేట్ ఆఫీస్, శ్రీ మణి సుబ్రమణియన్, విజయవాడ జోనల్ మేనేజర్, శ్రీ వీవీఆర్కే సుబ్రహ్మణ్యం, అమరావతి జోనల్ మేనేజర్ శ్రీ డి.సూర్యనారాయణ మూర్తితో పాటు ఇండియన్ బ్యాంక్ సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.