1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Canada's PM Justin Trudeau and his wife announce separation

భార్యకు విడాకులు ఇచ్చిన దేశ ప్రధాని ఎవరు?

Canada PM
Canada PM
తమ భార్యలకు విడాకులు ఇచ్చేవారిలో దేశాధిపతులు, ప్రధానమంత్రులు సైతం చేరిపోతున్నారు. తాజాగా కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తన భార్యకు విడాకులు ఇచ్చారు. ఆయనకు సోఫీ అనే మహిళతో 18 యేళ్ళ క్రితం వివాహమైంది. ఇపుడు వీరి దాంపత్య జీవితానికి స్వస్తి చెప్పారు. ఈ విషయాన్ని వారు స్వయంగా వెల్లడించారు. ఇందుకుసంబంధించిన లీగల్ డాక్యుమెంట్లపై వారిద్దరూ సంతకాలు చేసినట్టు ట్రూడో కార్యాలయం అధికారికంగా బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. 
 
ట్రూడో (51) 2005లో 48 యేళ్ల సోఫీ(48)ని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం జస్టిస్, సోఫీతమ పిల్లలను ఓ భద్రమైన ప్రేమపూరిత వాతావరణంలో పెంచడంపైనే దృష్టిపెట్టారని ట్రూడో కార్యాలయం తన ప్రకటనలో తెలిపింది. వారంతా ఎప్పటికీ ఓ కుటుంబమేనని అందులో వెల్లడించింది.
తర్వాతి కథనం
సీమా హైదర్-సచిన్‌లకు ఆఫర్లు.. గుజరాత్ నుంచి ఈ దంపతులకు జాబ్స్