ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 ఆగస్టు 2023 (10:38 IST)

షోయబ్ మాలిక్ ఓ బిడ్డకు తండ్రి.. సానియాకు భర్త కాదా..?

sania couple
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్, టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా విడాకుల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. షోయబ్ తన ఇన్‌స్టాగ్రామ్‌ బయోలో కీలక మార్పు చేయడమే మళ్లీ విడాకుల వార్తలు వెలుగులోకి రావడానికి కారణం అయ్యాయి. 
 
ఒకప్పుడు ఆయన బయోలో ‘సానియా భర్త’ అని రాసుండేది. ప్రస్తుతం దాని స్థానంలో ‘ఓ బిడ్డకు తండ్రి’ అన్న వాక్యం వచ్చి చేరడంతో షోయబ్.. సానియాతో తెగతెంపులు చేసుకున్నాడని.. వారి మధ్య అభిప్రాయ బేధాలున్నాయనే వదంతులు మొదలయ్యాయి. 
 
సానియా, షోయబ్  2010లో వివాహం చేసుకున్నారు. వారికి ఇజాన్ మిర్జా మలిక్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. విడాకులు వార్తలు వచ్చాక గతంలో తాము కలిసే ఉన్నామని స్పష్టం చేశారు. తాజాగా షోయబ్ ఇన్‌స్టా బయోకు చేసిన మార్పులతో మరోసారి విడాకుల వదంతులు జోరందుకున్నాయి.