ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్

విడాకుల దిశగా మరో టాలీవుడ్ ప్రేమ జంట?

colors swathi
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన మరో హీరోయిన్ తన భర్త నుంచి విడాకులు తీసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె పేరు కలర్స్ స్వాతి. ఆమె తన ఇన్‌స్టాఖాతా నుంచి తన భర్త వికాస్ వాసు ఫోటోను తొలగించింది. దీంతో ఆమె విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన హీరోయిన్ సమంత, నటి నిహారికలు కూడా తమతమ భర్తల నుంచి విడాకులు తీసుకున్నారు. తాజాగా ఈ జాబితాలో కలర్స్ స్వాతి కూడా చేరబోతున్నారనే టాక్ వినిపిస్తుంది.
colors swathi
 
తన ప్రియుడైన వికాస్ వాసు ఓ విమాన పైలెట్. ఆయన్ను గత 2018లో కలర్స్ స్వాతి వివాహం చేసుకున్నారు. అయితే, దాదాపు రెండేళ్ల క్రితం వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్టు ఇదే తరహా పుకార్లు పుట్టుకొచ్చాయి. అప్పట్లో కూడా తన భర్త ఫోటోలు ఆమె తొలగించడంతో కలకలం రేగింది. దీంతో ఆమె స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. సోషల్ మీడియాలోని భర్త ఫోటోలను ఆర్కైవ్స్‌లో పెట్టుకున్నట్టు చెప్పిన ఆమె తన ఫోనులోని భర్తఫోటోలను కూడా చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇపుడు వచ్చిన పుకార్లపై ఆమె ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.