సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 జులై 2023 (15:02 IST)

అబ్బా.. సుమతో విడాకులా.. ఎన్నిసార్లు చెప్పాలి.. రాజీవ్ కనకాల

Suma_Rajeev
Suma_Rajeev
యాంకర్ సుమ, యాక్టర్ రాజీవ్ కనకాల విడాకులు తీసుకోబోతున్నారనే వార్త ఫిలిమ్ నగర్ వర్గాల్లో కొన్నాళ్ల పాటు చక్కర్లు కొడుతోంది. ఈ వార్తలపై రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. 
 
సుమతో విడాకులు తీసుకునేది లేదు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెప్పాం. ఏం చెప్పినా ఈ వదంతలు వస్తూనే వున్నాయి. ఈ వార్తలు మా అమ్మానాన్నలు ఉన్నప్పుడు వచ్చి ఉంటే ఇంకా ఎక్కువ బాధ ఉండేదేమో. ఇలాంటి వార్తలను సుమ పెద్దగా పట్టించుకోదని.. కానీ తాను మాత్రం తేలికగా తీసుకోలేనని రాజీవ్ అన్నారు. 
 
అంతేగాకుండా ఈ విషయంపై స్కూలులో పిల్లలు కాస్త ఇబ్బంది పడ్డారని తెలిపారు. ఎప్పటికీ తాను సుమ విడిపోమని.. కలిసే వుంటామని చెప్పడం కోసం.. ఇంటర్వ్యూకి వచ్చినట్లు తెలిపారు.
 
తాము కలిసే వున్నాం అనేందుకు ఎన్నెన్ని చేయాల్సి వచ్చిందోనని గుర్తు చేసుకున్నారు. సుమతో తాను కలిసి వున్నాననే విషయాన్ని చెప్పుకోవడం కష్టమైపోతుందని.. మొత్తానికి మా మధ్య మనస్పర్ధలు లేవని.. విడాకులకు ప్రసక్తే లేదని రాజీవ్ స్పష్టం చేసారు.