బుధవారం, 29 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 17 జులై 2023 (10:41 IST)

క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో ఓపెన్‌హైమర్ కు సమ్మె ప్రభావం లేదు- జులై 21న రాబోతుంది

Oppenheimer's  look
Oppenheimer's look
ఇటీవలే హాలీవుడ్ లో కార్మికులు సమ్మెకు దిగారు. తమ వేతనాలు పెంచాలని రోడ్డుకు ఎక్కారు. షూటింగ్ లు ఆగిపోయాయి.  కానీ సినిమా విడుదలకు ఎటువంటి ప్రభావం లేదు అని యూనివర్సల్ పిక్చర్స్ తెలియజేస్తుంది.  తాజా జులై 21న ఓపెన్‌హైమర్ చిత్రం విడుదల కాబోతుంది.  ఎపిక్ బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ఓపెన్‌హైమర్ చిత్రం. ఇది క్రిస్టోఫర్ నోలన్ రచన, నిర్మాణం, దర్శకత్వంలో రూపొందింది. యూనివర్సల్ పిక్చర్స్ ద్వారా ఇంగ్లీష్‌లో మాత్రమే జులై 21న విడుదలవుతుంది.  
 
Oppenheimer's  look
Oppenheimer's look
ఇది 2005లో కై బర్డ్, మార్టిన్ J. షెర్విన్ రచించిన అమెరికన్ ప్రోమేథియస్ జీవితచరిత్ర ఆధారంగా మాన్‌హట్టన్ ప్రాజెక్ట్‌లో మొదటి అణ్వాయుధాలను అభివృద్ధి చేయడంలో సహాయపడిన సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త J. రాబర్ట్ ఓపెన్‌హైమర్ గురించి. ఈ చిత్రంలో సిలియన్ మర్ఫీ టైటిల్ క్యారెక్టర్‌గా నటించారు, ఎమిలీ బ్లంట్, మాట్ డామన్, రాబర్ట్ డౌనీ జూనియర్, ఫ్లోరెన్స్ పగ్, జోష్ హార్ట్‌నెట్, కేసీ అఫ్లెక్, రామి మాలెక్ మరియు కెన్నెత్ బ్రానాగ్ వంటి సహాయక బృందం ఉంది. సంగీతం సమకూర్చినవారు: లుడ్విగ్ గోరాన్సన్. 
 
65 mm లార్జ్ ఫార్మాట్ ఫిల్మ్ ఫోటోగ్రఫీతో కలిపి IMAX ఫార్మాట్‌లో చిత్రీకరించబడింది. కాలాన్ని బట్టి కొన్ని భాగాలు బ్లాక్ అండ్ వైట్ లో కనిపిస్తాయి.  ఫోటోగ్రఫీలో గగుర్పాటు కలిగించే సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ ఎన్నో ఉన్నాయి. 
 
తారాగణం -సిలియన్ మర్ఫీ జె. రాబర్ట్ ఒపెన్‌హీమర్‌గా, ఎమిలీ బ్లంట్ అతని భార్య, కిట్టి, మాట్ డెమోన్‌గామరియు రాబర్ట్ డౌనీ జూనియర్, రామి మాలెక్ & amp; కెన్నెవ్త్ బ్రానాగ్
సినిమాటోగ్రఫీ- హోయ్టే వాన్ హోటెమా
సంగీతం- లుడ్విగ్ గోరాన్సన్
స్పెషల్ ఎఫెక్ట్స్ సూపర్‌వైజర్ –స్కాట్ ఫిషర్ & ఆండ్రూ జాక్సన్